iQOO 13 5G : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తాజాగా ఐక్యూ 13 మెుబైల్ ను లాంఛ్ చేసింది. ఈ ఫీచర్స్ ఇప్పటికే టెక్ ప్రియులను ఆకట్టుకున్నాయి. అదిరిపోయే ఫీచర్స్ తో లాంఛ్ అయిన ఈ మొబైల్ పై ప్రస్తుతం అమెజాన్ లో బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం ఈ మెుబైల్ ను మీరూ సొంతం చేసుకోవాలంటే ఆ ఆఫర్స్ పై ఓ లుక్కేయండి.
iQOO 13 5G మెుబైల్ తాజాగా ఇండియాలో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మెుబైల్ పై ప్రస్తుతం అదిరే ఆఫర్స్ ఉన్నాయి. Amazon నుండి ఈ మెుబైల్ ను కేవలం రూ. 31,000కే పొందవచ్చు. పాత ఫోన్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకునే కస్టమర్స్ కు ఇదే బెస్ట్ ఛాయిస్. అమెజాన్‌లో iQOO 13 ప్రస్తుతం 12GB+256GB వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సైతం అందిస్తోంది. ఈ ఆఫర్ లో రూ. 22,800 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ మెుబైల్ పై బ్యాంక్ డిస్కౌంట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి.
iQOO 13 5G Features –
డిస్ ప్లే –
iQOO 13 లో వాల్యూమ్ రాకర్ తో పాటు స్క్రీన్ కుడి వైపున పవర్ బటన్, మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ డిజైన్ ఉంది. 2K రిజల్యూషన్ డిస్ ప్లే ఉంది. 144hz రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాలు స్క్రీన్ కూడా ఉంది. ఇక గేమింగ్ సెషన్‌లలో కూడా 7K VC కూలింగ్ సిస్టమ్, Qualcomm AI ఇంజిన్ మల్టీ మోడల్ Gen AIతో మల్టీపుల్ ఇన్‌పుట్‌లకు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా – iQOO 13 ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చేసింది. ఇక మొబైల్ ఫోటోగ్రఫీలో బెస్ట్ గా నిలుస్తుంది. వైడ్, టెలిఫోటో, అల్ట్రా వైడ్ స్నాపర్ ఉన్నాయి. ఇందులో మూడు 50MP సెన్సార్లు సైతం ఉన్నాయి. 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP సోనీ టెలిఫోటో లెన్స్, 50MP ISOCELL JN1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ ఉంది.
Snapdragon 8 Elite AI పవర్డ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ తో వచ్చేసింది. కాల్కమ్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ తో ఈ ఫోన్ వచ్చేసింది. ఇక 16 GB వరకు RAM ఎక్స్టెండ్ చేసుకునే సదుపాయం ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ – బ్యాటరీ లైఫ్ మరొక హైలైట్. 6000mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే AI 5G, Wi-Fi 7 ఫీచర్స్ సైతం ఉన్నాయి. iQOO 13 Android 15 ఆధారంగా Funtouch 15 OS తో వచ్చేసింది. నాలుగు ప్రధాన Android OS అప్‌డేట్‌లు, ఐదు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లతో వచ్చేసింది. ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ డిజైన్ సైతం అత్యద్భుతంగా ఉంది. ఫ్లాట్ డిజైన్ తో నాలుగు వైపులా బెజెల్స్ తో ఈ ఫోన్ వచ్చేసింది.
ALSO READ : “ఆ నంబర్స్ లిఫ్ట్ చేస్తున్నారా.. ఇంక అంతే” – DoT