E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE: కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుందిరోయ్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్..!

Samsung Galaxy S24 FE: కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుందిరోయ్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్..!
Advertisement

Samsung Galaxy S24 FE: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Samsung త్వరలో తన లైనప్‌లో ఉన్న ఒక కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. Samsung Galaxy S24 FE ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో త్వరలో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఫోన్‌కి సంబంధించిన సమాచారం ఆన్‌లైన్ లీక్‌ అయ్యింది. అంతేకాకుండా తాజాగా ఈ ఫోన్ ఫ్రాన్స్‌లోని Samsung వెబ్‌సైట్‌లో సపోర్ట్ పేజీ లైవ్ చేయబడింది. కాగా ఈ కొత్త మోడల్ గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ తీసుకొచ్చిన Galaxy S23 FEకి అప్‌‌గ్రేడ్ వెర్షన్.

ఇకపోతే Samsung Galaxy S24 FE ఫోన్ మోడల్ నంబర్ SM-S721B తో వస్తున్నట్లు తెలుస్తోంది. Galaxy S24 FE డ్యూయల్ సిమ్‌గా ఉంటుందని ఇది సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 6.65 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్‌లోని లిస్టింగ్ దీనికి Exynos 2400 చిప్‌సెట్ ఉందని వెల్లడించింది. ఇది 8 GB RAM కలిగి ఉండే ఛాన్స్ ఉంది.

Advertisement

అదే సమయంలో ఇది 128 GB స్టోరేజ్, 256 GB స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ భారత్‌, యూరప్‌లో కాకుండా ఇతర మార్కెట్‌లలో లాంచ్‌ అవుతుందా లేదా అనేది తెలియరాలేదు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ని కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4,500 mAh బ్యాటరీతో అందించబడుతుంది.

Also Read: సామాన్యులే ఫోకస్‌.. శాంసంగ్ నుంచి రెండు ఫోన్లు..!

Advertisement

ఇదిలా ఉంటే గత నెలలో Samsung తన కొత్త సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. దీనితో పాటు గెలాక్సీ బడ్స్ 3, బడ్స్ 3 ప్రోలను కూడా తీసుకొచ్చింది. వీటి సేల్స్ బుధవారం నుండి దేశంలో ప్రారంభమైంది. కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన Samsung Galaxy Z Fold 6 ఫోన్ 12 GB + 256 GB వేరియంట్ ధర రూ. 1,64,999 గా నిర్ణయించింది. అదే సమయంలో 12 GB + 512 GB వేరియంట్ రూ.1,76,999గా, 12 GB + 1 TB వేరియంట్ రూ. 2,00,999గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ నేవీ, పింక్, సిల్వర్ షాడో కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరొకటి ఉంది. అదే Galaxy Z Flip 6 ఫోన్. దీని 12 GB + 256 GB వేరియంట్ ధర రూ. 1,09,999 గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో 12 GB + 512 GB వేరియంట్ రూ. 1,21,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ వెబ్‌సైట్, ప్రధాన ఇ-కామర్స్ సైట్‌లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×