BigTV English

Waqf Act Amendment Row: వక్ఫ్ ల్యాండ్ విషయంలో కొత్త చట్టం.. ప్రభుత్వం చెబుతున్న లాభాలేంటి..

Waqf Act Amendment Row: వక్ఫ్ ల్యాండ్ విషయంలో  కొత్త చట్టం.. ప్రభుత్వం చెబుతున్న లాభాలేంటి..

వక్ఫ్ బోర్డును కంట్రోల్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అవును ఈ చట్టం ఆమోదం పొందితే సదరు భూములు.. ఆస్తుల విషయంలో కూలంకషంగా తనిఖీలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు. వక్ఫ్ బోర్డులో మహిళలకూ ప్రాధాన్యత వస్తుంది. మొత్తంగా చట్టంలో 40 సవరణలు చేయనుంది మోదీ సర్కార్. అయితే ఇప్పుడీ వక్ఫ్ బోర్డు చుట్టూ రాజకీయ అలజడి నెలకొంది. వక్ఫ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది ముస్లిం పర్సనల్‌ లా బోర్డు హెచ్చరించింది. మరి అంతలా అందులో ఏముంది అంటే.. భూములు.. వేల ఎకరాలు ల్యాండ్ లు.

నిజానికి వక్ఫ్ బోర్డు చట్టం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. బ్రిటీష్ వారు 1923లో ముసుల్మాన్ వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత 1925లో మద్రాస్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ టైంలోనే దీనిపై వ్యక్తిరేకతలు వినిపించాయి. దీంతో 1927లో మద్రాస్ హిందూ రిలీజియస్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌గా పేరు మార్చారు. అనంతరం నెమ్మదిగా రూపులు మార్చుకోని వక్ఫ్ చట్టంగా 1954లో ఆమోదముద్ర వెయించుకుంది. అనంతరం 1995లో ఇందులో మొదటిసారి సవరణలు చేశారు.ఇక 2013లో రెండోసారి సవరణ చేశారు.


సవరణ ప్రకారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు కూడా వక్ఫ్ బోర్డు మ్యాటర్ లో ఇన్వాల్ అవ్వకూడదు. ఇది అప్పటి సర్కార్ స్వతహాగా తీసుకున్న డెసిషన్ కాదు. ముస్లిం వర్గాల డిమాండ్ మేరకు యూపీఏ సర్కార్ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. ఈఈ క్లెయిమ్స్ ను కోర్టులో సవాలు చేయడమంటే సాధ్యం కానీ పని.  కానీ అలుసుచ్చిందే అదునుగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందాయి. బోర్డుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Also Read: పరిచయం, అవార్డు ఆయన పెట్టుబడి.. బుక్కైన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్

ఉదాహరణకు తమిళనాడులోని తిరుచెందురై గ్రామం తీసుకుందాం. ఈ వీలేజ్ పై మొత్తం హక్కు తమకే ఉందని తమిళనాడు వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. ఈ గ్రామంలో 15 వందల ఏళ్ల నాటి హిందూ దేవాలయం ఉంది. 14 వందల ఏళ్ల నాటి మత బోర్డు..15 వందల ఏళ్ల నాటి గుడిపై ఆరోపణలు చేయడం నిజంగా హాస్యాస్పదమే. ఆ తర్వాత కావేరీ తీరాన ఉన్న సుప్రసిద్ధ చంద్రశేఖరస్వామి ఆలయం వాటి భూములు కూడా తనవేనంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇలా ఆలయ భూములు, ఊర్లను తమ భూములనే వక్ఫ్ బోర్డ్ ప్రకటనతో..జనం ఆగ్రహానికి అంతులు లేకుండా పోయింది. కేంద్రానికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున్న అందాయి.

ఇక ఇంతేనా.. నిజానికి భారతదేశంలోని వక్ఫ్ బోర్డులకు దాదాపు 52,000 ఆస్తులు ఉన్నాయి. 2009లో రిజిస్టర్డ్‌ వక్ఫ్ ప్రాపర్టీలు 3 లక్షలు ఉండగా ఇందులో 4 లక్షల ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే 8 లక్షల ఎకరాల్లో 872,292 రిజిస్టర్డ్‌ వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయి. అంటే 13 సంవత్సరాలలోనే వక్ఫ్ భూమి రెట్టింపు అయింది. కనిపించిన భూమి ఇకపై తమదే అనే హక్కుకు షరత్తులు పెట్టబోతోంది. వక్ఫ్ కు పరిమిత అధికారులే ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయింది. అంతేకాదు ఈచట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

కానీ కేంద్రం నిర్ణయంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా స్పందించింది. వక్ఫ్ చట్టంలో ఎటువంటి మార్పులను అంగీకరించబోమని ప్రకటన చేసింది. కేంద్ర నిర్ణయంపై అసదుద్దీన్ కూడా ఫైరయ్యారు. ముస్లింల నుంచి వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలని చూస్తుందని మత స్వేచ్ఛకు భంగం కలిగించాలని మోదీ సర్కార్ భావిస్తుందని ఆరోపించారు. ఎవరేం అన్నా.. తన పని తనదే అన్న రీతిలో వెళ్తోంది కేంద్రం.. వక్ఫ్‌ ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సవరణలు చేస్తోంది.  అదే జరిగితే.. ఏం జరుగుతుందో కూడా చూడాలి.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×