BigTV English

Viral Video : ఛీ..ఛీ.. ఏం మనుషులురా బాబు.. కాకులకు ఉన్నపాటి ఐకమత్యం లేకపాయే..

Viral Video : ఛీ..ఛీ.. ఏం మనుషులురా బాబు.. కాకులకు ఉన్నపాటి ఐకమత్యం లేకపాయే..

Ghaziabad Milk Van Accident Viral Video: ఒక కాకి చనిపోతే.. చుట్టూ వందల కాకులు చేరి కావ్ కావ్ అంటూ అరుస్తుంటాయి. అలాగే కుక్క చనిపోయినా దాని తోటి కుక్కలన్నీ దీనంగా చుట్టూ చేరి బాధపడతాయి. కాకులు, కుక్కలే కాదు.. జంతువుల్లో ఏ జంతువు చనిపోయినా మిగతా జంతువులు ఐకమత్యాన్ని చూపిస్తాయి. కానీ.. మనుషుల్లో స్వార్థం పెరిగి ఐకమత్యం కొరవడింది.


ఒక మనిషి రోడ్డు ప్రమాదానికి గురైతే.. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసి ఆస్పత్రికి తరలించాల్సింది పోయి.. ఎవడికి వాడే సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ.. తోలుబొమ్మలాట చూసినట్లు చూస్తుండిపోతారు. అవతలి మనిషి ప్రాణం ఎలా పోతుందో అని వీడియోలు తీయడంపై ఉండే శ్రద్ధ.. ఆ మనిషి ప్రాణం కాపాడటంపై ఉండట్లేదు.

ఇక ఏదైనా లోడ్ తో వెళ్తున్న లారీ రోడ్డుప్రమాదానికి గురైతే.. ఆ డ్రైవర్ కు సహాయం చేయడం మాట అటుంచితే.. దొరికిందే ఛాన్స్ అని అందులో ఉన్న సరుకంతా ఎత్తుకుపోతారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రోడ్డుప్రమాదంలో పాలవ్యాన్ డ్రైవర్ చనిపోగా.. అతడిని కనీసం పట్టించుకోని ప్రజలు.. ఆ ట్యాంకర్లోని పాలకోసం ఎగబడ్డారు. లీటర్లకు లీటర్ల పాలు క్యాన్లలో పట్టుకుని తీసుకెళ్లారు.


ఘజియాబాద్ లోని ఢిల్లీ – మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే పై రెండు వాహనాలు ఢీ కొనగా.. ప్రమాదంలో లారీ డ్రైవర్ చనిపోయాడు. క్లీనర్ కు గాయాలయ్యాయి. క్లీనర్ కు సహాయం చేయాల్సిన స్థానికులు.. మానవత్వం మరిచిపోయి.. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా బాటిళ్లు, క్యాన్లలో పాలను పట్టుకుని తీసుకెళ్లారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. క్లీనర్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×