Samsung Price Drop: మీరు అదిరిపోయే ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే హోలీ పండుగ సందర్భంగా సామ్‌సంగ్ సంస్థ క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో తన Galaxy S24 Plusపై ఏకంగా రూ. 20 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 ప్లస్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో లభిస్తుంది. ఈ ఫోన్ చాలా స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌తో నిర్మించబడింది. నీటి, ధూళి నిరోధకత కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
ఇది 6.7 అంగుళాల డైనమిక్ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, అత్యుత్తమమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ డిస్‌ప్లేలో ఉన్న vibrant coloursను చూసినప్పుడు మీరు కొత్త అనుభూతి పొందుతారు. ఈ ఫోన్ Android 14పై కొనసాగుతుంది. భవిష్యత్తులో ఈ ఫోన్ కి అప్‌గ్రేడ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు గెలాక్సీ S24 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకున్నప్పుడు, సమర్థవంతంగా పనిచేస్తుంది. Samsung ఈ పరికరాన్ని Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో తీసుకొచ్చింది. దీనిలో 12GB RAM, 512GB స్టోరేజ్ సౌకర్యాలు ఉన్నాయి.
Read Also: Laptop Best Deal: హోలీ గ్రేట్ డీల్..ప్రముఖ ల్యాప్‌టాప్ రేట్లు 41% తగ్గాయోచ్..
Samsung Galaxy S24 Plus కెమెరా సెటప్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో 50 + 10 + 12 మెగా పిక్సెల్ సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరాలు ఫోటోగ్రఫీ కోసం అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఈ ఫోన్ ద్వారా అత్యుత్తమ ఫోటోలు, వీడియోలను తీసుకోవచ్చు. 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
ఇది 4900mAh బ్యాటరీతో శక్తివంతమైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని వల్ల మీరు దీనిని ఎక్కువ సమయం పాటు వినియోగించుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా మీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తూ ఏ పనైనా సజావుగా నిర్వహించుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ పై 20 వేల రూపాయల తగ్గింపు అందిస్తోంది. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే, అదనంగా మరో 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా మీరు IDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే, మీరు రూ. 750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది వినియోగదారులకు మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు నెలవారీ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. మీకు తక్కువ బడ్జెట్ ఉంటే, దీనిని రూ.9,500 నెలవారీ EMI చెల్లింపుల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
మరో ఆసక్తికరమైన ఆఫర్ ఏంటంటే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం కూడా ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కొత్త గెలాక్సీ S24 Plus తీసుకుంటే, మీరు రూ.52,250 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ పాత ఫోన్ విలువ రూ.35,000 అయితే, మీరు గెలాక్సీ S24 ప్లస్‌ను కేవలం రూ. 22,000కి కొనుగోలు చేయవచ్చు. ఇలా పాత ఫోన్ రిటర్న్ ఇవ్వడం ద్వారా తగ్గింపు పొందవచ్చు.