Heat wave alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా సమ్మర్ సీజన్ షురూ కాకముందే రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు చోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే వాతావరణ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తాజాగా ఇవాళ నిర్మల్ జిల్లాలోని లింగాపూర్ లో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలో 40 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. కాగా మార్చ్ 13 నుంచి 18 వరకు మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప పగటిపూట బయట తిరగవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
రేపటి నుంచి రాష్ట్రంలో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
మార్చి మధ్యలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్లుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండతో చాలా మంది జ్వరం, జలుబులతో ఇబ్బందులు పడుతున్నట్లు హైదరాబాద్ నగరవాసులు వెల్లడిస్తున్నారు. అందుకోసం శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని సూచించారు. నూనెతో చేసిన వేపుళ్లు, హోటల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు, రాగి జావ తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ALSO READ: Group-2 Results: గ్రూప్-2 టాప్ 100 ర్యాంకుల్లో నలుగురే మహిళలు..