Samsung Galaxy S25 Ultra : సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్.. త్వరలోనే సాంసంగ్ గెలక్సీ s25 అల్ట్రా మొబైల్ ను లాంఛ్ చేయనుంది. లేటెస్ట్ అప్డేట్స్ తో ఈ మొబైల్ రాబోతుంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ తమ ఫ్లాగ్ షిప్ లో బెస్ట్ మొబైల్స్ ను లాంచ్ చేయడానికి సిద్ధమైపోయాయి. ఇక ఇప్పటికే వన్ ప్లస్ 13 సిరీస్ లాంఛ్ అయ్యి మొబైల్ ప్రియులను ఆకట్టుకోగా.. ఇప్పుడు సాంసంగ్ గాలక్సీ s 25 మొబైల్ సిరీస్ ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతుంది. మరి ఇంకో పది రోజుల్లో లాంఛ్ కాబోతున్న ఈ మొబైల్ టాప్ 10 ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సాంసంగ్ కంపెనీ తీసుకొస్తున్న సాంసంగ్ ఎస్ 25 మొబైల్ జనవరి 22 లాంచ్ కాబోతుంది. ఈ ఫ్లాగ్ షిప్ సిరీస్ లో 3 మెుబైల్స్ రాబోతున్నాయి. వీటి ఫీచర్స్ అదిరేలా ఉన్నాయి.
పెద్ద డిస్‌ప్లే : Samsung Galaxy S25 Ultra లో 6.8 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంటుంది. ఇది చాలా బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇవ్వటంతో పాటు లోతైన కాంట్రాస్ట్‌ను అందిస్తుంది.
అత్యాధునిక ప్రాసెసర్ : ఈ ఫోన్లో అధిక పనితీరును అందించే అధునాతన Snapdragon 8 Gen 3 లేదా Exynos 2400 ప్రాసెసర్ ఉంటుంది.
ఆధునిక కెమెరా వ్యవస్థ : ఈ ఫోన్‌లో 200MP ప్రధాన కెమెరా, 12MP పర్‌సోనల్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్ వంటి కెమెరా సిస్టమ్ ఉంది.
బ్యాటరీ: 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఇంకా 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
5G సపోర్ట్ : Samsung Galaxy S25 Ultra 5G సపోర్ట్‌ను అందిస్తుంది. దీంతో స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ అనుభవం పొందొచ్చు.
అద్భుతమైన డిజైన్ : ఈ సిరీస్ మెుబైల్స్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి ఇది ప్రీమియం లుక్ ఫీలింగ్‌ను ఇస్తుంది.
IP68 వాటర్ రిజిస్టెంట్ : ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది.
S Pen సపోర్ట్ : Galaxy S25 Ultra తో S Pen అందుబాటులో ఉంటుంది, ఇది ఈజీ స్క్రీన్‌షాట్‌ల కోసం ఉపయోగపడుతుంది.
అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు : ఈ ఫోన్లో అధిక రేటింగ్ ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, డాల్బీ ఆటోమిక్ ఆడియో సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI : Samsung Galaxy S25 Ultra, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి Samsung One UI ఇంటర్ఫేస్‌తో అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్ సమర్ధవంతమైన పనితీరు, అధిక కెమెరా రిజల్యూషన్ అదిరిపోయే ఫీచర్స్ బెస్ట్ మొబైల్ పెర్ఫార్మన్స్ ను అందిస్తాయి. ఈ మొబైల్ ధర సైతం ఈ ఫ్లాగ్ షిప్ లో ముందు వచ్చిన శాంసంగ్ గెలాక్సీ s24 సిరీస్ రేంజ్ లోనే ఉండే ఛాన్స్ ఉన్నట్టు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరి కొన్ని రోజుల్లోనే లాంచ్ కాబోతున్న ఈ మొబైల్ ను కొనాలనుకునే యూజర్స్ తప్పకుండా ట్రై చేసేయండి.