అమెరికాను కార్చిచ్చు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గత 6 రోజులుగా లాస్ ఎంజిల్స్ తగలబడిపోతోంది. అడవుల నుంచి వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాల్లోకి చేరి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదం ఏకంగా 40 వేలకు పైగా ఎకరాలను బూడిదగా మార్చింది. సుమారు 15 వేల భవనాలు అగ్ని ఆహుతి అయ్యాయి. హాలీవుడ్ కు చెందిన పలువురు సినీ తారల నివాసాలు కూడా ఇందులో ఉన్నాయి.
20 మంది మృతి, 2 లక్షల మంది నిరాశ్రయులు
సౌత్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నగరం హాలీవుడ్ కు ఆయువుపట్టు లాంటిది. టీవీ, సినిమా రంగాలకు కేంద్రంగా కొనసాగుతున్నది. అగ్నికీలల దాటికి ఆగమాగం అయ్యింది. ఇప్పటి వరకు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. బతికి ఉన్న వాళ్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 2 లక్షలకు పైగా మంది నిరాశ్రయులయ్యారు.
కాలి బూడిదైన 100 ఏండ్ల చారిత్రక భవనం
ఇక ఈ కార్చిచ్చు ప్రభావం పాలిసేడ్స్ మీద దారుణంగా ఉంది. స్టార్ బక్స్ అవుట్ లెట్ ను కలిగి ఉన్న 100 ఏండ్ల పురాతన భవం కార్చిచ్చు కారణంగా కాలి బూడిదైంది. పాలిసేడ్స్ విలేజ్ లో 1924లో ఈ స్టార్ బక్స్ కేఫ్ ను ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక భవనంలో ఓ షాంపింగ్ సెంటర్ ఉంది. తాజాగా మంటలకు ఈ భవనం నామరూపాలు లేకుండా పోయింది. చాలా మంది ఈ భవనానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కార్చిచ్చుకు ముందు, ఆ తర్వాత అంటూ ఘోర విపత్తుకు సంబంధించిన విజువల్స్ నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఓ నెటిజన్ ఎక్స్ లో పాలిసేడ్స్ స్టార్ బక్స్ ఫోటోను షేర్ చేస్తూ.. “వినాశకర అగ్నిప్రమాదంలో ధ్వంసమైన శతాబ్దాల నాటి బ్యూటీ” అంటూ కామెంట్ పెట్టాడు. “ఈ మంటలు 100 ఏళ్ల నాటి చారిత్రాత్మక భవనాన్ని నామరూపాలు లేకుండా చేయమే కాదు, కాలిఫోర్నియా వారసత్వ సంపదను నాశనం చేసింది” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “నాకు ఎంతో ఇష్టమైన స్టార్ బక్స్ ను ఇలా చూడ్డం హృదయ విదారకంగా ఉంది” అని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
The Palisades Village Starbucks is unrecognizable after being ravaged by fire.
'The Business Block' in Pacific Palisades appears to be completely burned down. The Starbucks building was 100 years old, commissioned in 1924.
The fire has reached 11,000 acres, with over a thousand… pic.twitter.com/edhAMQldHX
— Collin Rugg (@CollinRugg) January 8, 2025
Read Also: భూమ్మీద మానవులు అంతరిస్తే? మన స్థానంలోకి వచ్చే తెలివైన జంతువు ఏదో తెలుసా?
హృదయవిదారకంగా సాలిసెడ్స్ విలేజ్
ఒకప్పుడు హై ఎండ్ స్టోర్స్ వైవ్స్ సెయింట్ లారెంట్, ఎరూహాన్ మార్కెట్లకు నిలయంగా ఉన్న సాలిసెడ్స్ విలేజ్ ఇప్పుడు బూడిదై దర్శనం ఇస్తంది. ప్రఖ్యాత స్టోర్లు అన్నీ కాలిపోయి కనిపిస్తున్నాయి. లాస్ ఎంజిల్స్ లోని ఆ ప్రాంతం అగ్ని ప్రమాదం వల్ల ఎక్కువగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రాంతంల సుమారు 20 వేలకు పైగా ఎకరాలు మంటల్లో కాలిపోయాయి. ఎంతో ఘన చరిత్ర అంతా ఇప్పుడు గత చరిత్రగా మారిపోయింది.
Read Also: ఆ దేశం ట్రాఫిక్ లైట్లలో గ్రీన్ లైట్ ఉండదు, ఎందుకో తెలుసా?