తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : నేను రాజీనామా చేస్తా.. బీఆర్ఎస్ పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే కాంగ్రెస్ చేరిన వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే పార్టీ అధినేత కేసీఆర్ ను ఒప్పిస్తా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తాం మీరు సిద్దమా అన్నారు.
ఎస్ డీఎఫ్ నిధులు ప్రభుత్వానివా? కాంగ్రెస్ పార్టీవా? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరస్కరించిన వారు ప్రపోజల్స్ పంపిస్తే నిధులు ఎలా శాంక్షన్ చేస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు. మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూలేరని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి సంజయ్‌కు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌తో గెలవాలని డిమాండ్ చేశారు.
Also Read : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పేలిపోయిన కారు రెండు టైర్లు..