E-Paper
Advertisement

వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?

వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?
Advertisement

OnePlus Nord CE6 Lite Vs OPPO K14: ప్రస్తుత ఈ టెక్ యుగంలో బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కొనాలంటే తల ప్రాణం తోకకు వస్తోంది. ఎందుకంటే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వందల ఆప్షన్లు దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా వన్‌ప్లస్ నుంచి Nord CE6 Lite, ఒప్పో నుంచి K14 విడుదలైన విషయం తెలిసిందే. మరి ఈ రెండింటిలో ఏది కొంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చో ఒకసారి చూసేద్దాం రండి..

చూడటానికి ఈ రెండు ఫోన్లు చాలా స్టైలిష్‌గానే ఉన్నాయి. వన్‌ప్లస్ ఫోన్ చూస్తే చాలా సింపుల్‌గా, హుందాగా కనిపిస్తుంది. అదే ఒప్పో K14 అయితే కొంచెం వెరైటీ డిజైన్లతో కుర్రాళ్లకు నచ్చేలా ఉంది. అయితే స్క్రీన్ విషయానికి వస్తే మాత్రం వన్‌ప్లస్ కొంచెం బెటర్. దీనిలో వీడియోలు చూస్తున్నప్పుడు బొమ్మ చాలా స్పష్టంగా (FHD+) కనిపిస్తుంది. ఒప్పోలో క్లారిటీ (HD+) కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి.

Advertisement

Also Read: నథింగ్ విధ్వంసం.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇయర్‌బడ్స్‌పై రూ.8000 తగ్గింపు, ఇక ఎగరేసుకుపోవడమే!

సాధారణంగా ఫోన్ వాడుతున్నప్పుడు మధ్యలో స్లో అయితే చిరాకు వస్తుంది కదా. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్‌లో కొత్తగా వచ్చిన ప్రాసెసర్ వాడారు. దీంతో గేమ్స్ ఆడినా, ఎక్కువ యాప్స్ వాడినా ఫోన్ స్పీడ్‌గా పని చేస్తుంది. అదే ఒప్పో K14లో కొంచెం పాత మోడల్ ప్రాసెసర్‌ను వాడారు కాబట్టి.. వన్‌ప్లస్‌తో పోలిస్తే స్పీడ్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు. పైగా వన్‌ప్లస్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ ఉండటంతో భవిష్యత్తులో కూడా ఇది బాగా పనిచేయొచ్చు.

Advertisement

ఈ రెండు ఫోన్లలోనూ ఏకంగా 7,000mAh బ్యాటరీనే ఇచ్చారు. ఈ ఫోన్లను రోజులో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల వరకు ఛార్జర్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే.. కెమెరాల విషయానికి వస్తే రెండూ ఒకేలా ఉన్నాయి. పగటిపూట ఫొటోలు తీసుకోవడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఈ కెమెరాలు భలే సెట్ అవుతాయి.

ఒప్పో ఫోన్ ధర రూ.19,999 ఉండగా.. వన్‌ప్లస్ రూ.వెయ్యి తేడాతో రూ.20,999 ధర పలుకుతోంది. అయితే ఆ ఒక్క రూ.1.000 ఎక్కువ పెట్టినా.. మంచి స్క్రీన్ క్వాలిటీ, సూపర్ స్పీడ్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ కోసం వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ ఎంచుకోవడమే స్మార్ట్ డెసిషన్. లేదు.. జస్ట్ లుక్, తక్కువ ధర మాత్రమే కావాలనుకుంటే తప్ప.. మిగతా అన్ని రకాలుగా వన్‌ప్లస్ ఫోనే బెస్ట్ ఆప్షన్.

Also Read: అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×