E-Paper
Advertisement

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ
Advertisement

ఒకప్పుడు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోట. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్‌గా మారింది. నేతల తీరుతో ..ఆ పార్టీ ప్రజలకు దూరమైంది. అగ్రనాయకత్వానికి తలవంపులు తెచ్చేలా ఉన్న నేతల తీరుతో అక్కడ మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవడం గగనమే అని అనుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. మంత్రి సీతక్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలు .. ఉన్న ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేకుండా చేసుకుంటుందంటున్నారు.

మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉంటారని చెప్పుకుంటారు. ఫామ్ హౌజ్‌లో ఉండే అది కొద్ది మంది నేతల్లో , నమ్మిన బంటుగా ఉన్నవారిలో ప్రశాంత్‌రెడ్డి ఒకడు. అందుకే ఆయనకు తొలిసారి బీఆరెస్‌ సర్కార్‌ రాగానే కీలకమైన మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చాడు కేసీఆర్. ఆ తరువాత మంత్రిని చేశాడు. ఇది కేటీఆర్‌కు సుతారమూ ఇష్టం లేదనే ప్రచారం జరిగింది అప్పట్లో.

Advertisement

సిట్టింగులకే మళ్లీ మళ్లీ టికెట్లిచ్చిన కేసీఆర్‌ తీరుతో అంతటా ఎలా డ్యామేజీ జరిగిందో.. ఉమ్మడి నిజామాబాద్‌లో కూడా అదే రిపీట్‌ అయ్యింది. ఇక్కడ సిట్టింగుల అరాచకాలు, అవినీతిపై ప్రజల్లో విసుగు పుట్టిందనే ప్రచారం జరిగింది. అయినా ముచ్చటగా మూడోసారీ వారికే కేసీఆర్‌ టికెట్ ఇవ్వడంతో జనం ఛీదరించుకున్నారు. తిప్పికొట్టారు.

దీంతో ఒకప్పుడు ఘనమైన రాజకీయ చరిత్రను నమోదు చేసుకున్న బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పుడు నేతలపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలకు దూరమైంది. ఆ ఓడిన మాజీలు కూడా జనాల్లో కలిసి తిరగడం బంద్‌ చేశారు. మళ్లీ ఈసారి టికెట్ ఇవ్వరనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఇంచార్జి మంత్రిగా ఉన్న సీతక్కపై మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నోరు పారేసుకున్నాడు.

Advertisement

పింఛన్ల మంజూరులో చేసే రాజకీయ ఆరోపణలకు సహజంగానే తనకున్న నోటి దరుసును బాహాటంగానే ప్రదర్శించి సిగ్గుందా? అని ఆమెపై పరుషపదజాలాన్ని వాడాడు. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా ఆమె ప్రశాంత్‌రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఇదేనా కేసీఆర్‌ నీకు నేర్పిన సంస్కృతి? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని ఉరికించి ఉరికించి కొట్టిన చరిత్ర తనదని వార్నింగ్‌ ఇవ్వడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. మహిళా మంత్రిని అవమానించారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావనంలా వ్యాపించడంతో అందరి దృష్టి నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలపై పడింది. తన సామాజికవర్గాన్ని కూడా అతను అవమానపరిచేలా ఆ కామెంట్స్‌ ఉన్నాయని, మహిళలపై కనీస మర్యాద లేని ప్రశాంత్‌రెడ్డికి మంత్రి పదవి ఎలా ఇచ్చారని నిలదీసిన సీతక్క.. సొంత బిడ్డనే ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రశాంత్‌రెడ్డి నుంచి ఇంతకు మించిన సంస్కారం ఆశించడం వృథా అని ఆమె ధ్వజమెత్తారు.

జిల్లా రాజకీయాల్లో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్నటి ఎన్నికల్లో బాల్కొండ నుంచి ప్రశాంత్‌రెడ్డి.. చావుదప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. విపరీతమైన ఖర్చు పెడితే తప్ప గెలుపు సాధ్యం కాలేదనే ప్రచారం ఉంది. ఆ జిల్లాకు చెందిన మరో నాలుగు… ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గాల్లో సిట్టింగులు ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు బాల్కొండ పరిస్థితి గెలిచి బట్టకట్టే పరిస్థితి లేదంటున్నారు తాజా పరిస్థితుల నేపథ్యంలో.

నేతల తీరుతోఆ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టైందని కామెంట్స్‌ చేస్తున్నారు అక్కడి జనం.

Tags

Related News

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!

అసంతృప్తుల వేళ అసమ్మతి గోల! కోమటిరెడ్డి వ్యూహమేమిటీ..? పాత, కొత్త కలయికల గ్యాప్‌ను వాడుకుంటున్నారా? పార్టీలో అతనికి మద్దతెలా ఉంది?

Big Stories

Advertisement
×