E-Paper
Advertisement

విడుదలకు ముందే Vivo X500 సిరీస్, Watch GT 2 ధరలు లీక్.. ఈసారి బడ్జెట్ గట్టిగానే పెట్టాలి!

విడుదలకు ముందే Vivo X500 సిరీస్, Watch GT 2 ధరలు లీక్.. ఈసారి బడ్జెట్ గట్టిగానే పెట్టాలి!
Advertisement

Vivo X500 Series: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో నుంచి త్వరలోనే X500 సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ సిరీస్‌లో Vivo X500, Vivo X500 Pro, Vivo X500 Pro Max మోడళ్లు విడుదల కానున్నాయి. వీటితో పాటు Vivo Watch GT 2 స్మార్ట్‌వాచ్, Zeiss Telephoto Converter కిట్ కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ నాలుగు డివైజ్‌ల ధరలు, ర్యామ్, స్టోరేజ్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీంతో కొత్త ఫోన్లు కొనాలనుకునే వారిలో ఆసక్తి పెరిగింది.

Vivo X500 ధర ఎంతంటే?

ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. వివో X500 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో రానుంది. దీని ధర రూ.1,19,999గా ఉండొచ్చని సమాచారం. ఇక వివో X500 ప్రో కూడా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తోనే అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.1,49,999గా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లలో 512GB స్టోరేజ్ వేరియంట్లు వచ్చే అవకాశం లేదని సమాచారం.

Pro Max ధర, స్టోరేజ్ వివరాలు:

Advertisement

ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన వివో X500 ప్రో మ్యాక్స్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానున్నట్లు లీక్ వెల్లడించింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,59,999గా ఉండొచ్చు. అలాగే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,79,999గా ఉండొచ్చని అంచనా. దీనికి అదనంగా మాస్టర్ ఫోటోగ్రఫీ సెట్ కూడా తీసుకురావచ్చని సమాచారం. ఈ కిట్ కోసం మరో రూ.50,000 చెల్లించాల్సి రావచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు.

Also Read: ఫేస్ అన్‌లాక్ వెనుక ఇంత పెద్ద తంతంగం నడుస్తోందా? చీకట్లోనూ పనిచేసే ఆ 5 టెక్నాలజీలు ఇవే!

కెమెరా, ప్రాసెసర్ ప్రత్యేకతలు:

Advertisement

వివో X500 ప్రో, వివో ప్రో మ్యాక్స్ ఫోన్లలో జైస్ ట్యూనింగ్‌తో కూడిన మూడు వెనుక కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 200MP జైస్ APO టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ప్రో మ్యాక్స్‌లో రెండు 200MP కెమెరాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 సిరీస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉండనుంది.

లాంచ్ ఎప్పుడంటే?

వివో X500 సిరీస్, వాచ్ GT 2 భారత లాంచ్ సెప్టెంబర్ 26న జరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫోన్లు వివో ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నాయి. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు అపెక్స్ ఆరెజంజ్, ఎటర్నల్ బ్లాక్ రంగుల్లో, సాధారణ మోడల్ ఎంబర్ రెడ్, టైటానియం బ్లాక్ రంగుల్లో లభించనున్నాయి. వివో వాచ్ GT 2 ధర రూ.14,999గా ఉండొచ్చని లీక్ చెబుతోంది. అయితే ఈ ధరలు, వేరియంట్లపై కంపెనీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!

Tags

Related News

ఫేస్ అన్‌లాక్ వెనుక ఇంత పెద్ద తంతంగం నడుస్తోందా? చీకట్లోనూ పనిచేసే ఆ 5 టెక్నాలజీలు ఇవే!

ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!

గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?

కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం ఇక మరింత ఈజీ.. Vi Business నుంచి ఏఐ ఆధారిత వాట్సప్ సేవలు!

కరెంట్ పోతే ఇన్వర్టర్‌పై ఫ్యాన్,టీవీ ఎన్ని గంటలు నడుస్తాయి? పూర్తి వివరాలివిగో!

మిడ్‌రేంజ్ మార్కెట్లో మోటరోలా సంచలనం.. 53 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న Edge 70 Neo!

Big Stories

Advertisement
×