E-Paper
Advertisement

బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్‌బార్..సినిమాలు,క్రికెట్ మ్యాచ్‌లకి నెక్స్ట్ లెవెల్ సౌండ్!

బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్‌బార్..సినిమాలు,క్రికెట్ మ్యాచ్‌లకి నెక్స్ట్ లెవెల్ సౌండ్!
Advertisement

Mivi fort h350: ఈ రోజుల్లో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు.. టీవీ స్పీకర్ల సౌండ్ సరిపోక.. చాలా మంది హోమ్ ఆడియో సెటప్ వైపు చూస్తున్నారు. తక్కువ ధరలో.. థియేటర్ వైబ్ ఇచ్చే ఆప్షన్ కోసం వెతికే వాళ్లకి ఈ మోడల్ ఒక ఇంట్రెస్టింగ్ ఛాయిస్‌గా కనిపిస్తోంది. రూ.5,299 బడ్జెట్‌లో 350 వాట్స్ అవుట్‌పుట్‌తో రావడం దీని మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో సౌండ్ బార్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. దీని ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

5.1 ఛానల్ డిజైన్ ,డీప్ బేస్:

ఈ సౌండ్‌బార్ సెటప్ గురించి చూస్తే.. ఇందులో మెయిన్ సౌండ్‌బార్‌తో పాటు ఎక్స్‌టర్నల్ సబ్‌వూఫర్, రెండు సాటిలైట్ స్పీకర్లు వస్తాయి. 5.1 ఛానల్ కాన్ఫిగరేషన్ ఉండటం వల్ల.. సౌండ్ రూమ్ అంతా సమానంగా స్ప్రెడ్ అవుతూ మంచి సరౌండ్ ఫీలింగ్ ఇస్తుంది. బ్లాక్ ఫినిషింగ్‌తో.. మోడ్రన్ లివింగ్ రూమ్‌కి ఈజీగా సెట్ అయ్యేలా దీని డిజైన్ ఉంటుంది. ముఖ్యంగా సబ్‌ వూఫర్ డీప్ బేస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి యాక్షన్ సీన్స్ లేదా మ్యూజిక్ వినేటప్పుడు బీట్ బాగా వినిపిస్తుంది.

మల్టీ-ఇన్‌పుట్, బ్లూటూత్ v5.1 కనెక్టివిటీ:

Advertisement

కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో.. మల్టీ-ఇన్‌పుట్ సపోర్ట్ ఉంది.బ్లూటూత్ v5.1 ద్వారా మొబైల్, ల్యాప్‌ టాప్ లేదా టాబ్లెట్ నుంచి ఈజీగా వైర్‌లెస్‌గా పాటలు ప్లే చేసుకోవచ్చు. దాంతో.. పాటు టీవీ లేదా ఇతర డివైజ్‌ల కోసం HDMI ARC, ఆప్టికల్, యేఎస్బీ వంటి ఆప్షన్స్ కూడా ఉండటం వల్ల రక రకాల సెటప్స్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా దీనికి రిమోట్ కంట్రోల్ ఉండటం.. వల్ల సోఫాలో కూర్చునే వాల్యూమ్, మోడ్స్ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్:
ఇందులో ఉండే ఈక్యూ మోడ్స్ కూడా రోజువారీ యూసేజ్‌కి బాగా ఉపయోగ పడతాయి. మ్యూజిక్, మూవీ, న్యూస్, స్పోర్ట్స్ లాంటి మోడ్స్ ఉండటం వల్ల మనం చూసే.. కంటెంట్‌ని బట్టి సౌండ్ ట్యూన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు.. స్టేడియం ఫీల్ కోసం తగ్గ మోడ్ పెట్టుకోవచ్చు, డైలాగ్స్ క్లియర్‌గా వినిపించాలంటే.. వేరే మోడ్ ఎంచుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్లు లేదా ఫ్రెండ్స్ గెట్-టుగెదర్ టైమ్‌లో కూడా 350వాట్ల పవర్ వల్ల హాల్ అంతా సౌండ్ బాగానే వినిపిస్తుంది.

Advertisement

Also Read: గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?

కొనే ముందు గమనించాల్సిన విషయాలు:

రూ.5,299 ధరలో 5.1 ఛానల్, 350వాట్ల సౌండ్‌ బార్ ఆఫర్ చేయడం బడ్జెట్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని ఇస్తోంది. అయితే.. పర్చేజ్ చేసే ముందు కొన్ని విషయాలు కూడా గమనించాలి. రూమ్ సైజ్ మరీ పెద్దదిగా ..ఉంటే లేదా ప్రీమియం డాల్బీ ఆడియో రేంజ్ సౌండ్ ఆశిస్తే ..హై-ఎండ్ మోడల్స్‌తో పోలిక వేరుగా ఉంటుంది. అలాగే వైర్డ్ కనెక్షన్స్, స్పీకర్ల ప్లేస్‌మెంట్ విషయంలో ..మన రూమ్ లేఅవుట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ధరలో వర్త్ ఏనా?

మొత్తంగా చూస్తే.. మీ బడ్జెట్ రూ.5,000 నుంచి ర.5,500 మధ్యలో ఉండి, ఇంట్లోనే మంచి 5.1 సరౌండ్ సౌండ్, బేస్‌తో కూడిన 350W సౌండ్‌బార్ కావాలనుకుంటే.. ఈ మోడల్ ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. సినిమాలు, పాటలు, స్పోర్ట్స్ ఇలా అన్నింటికీ సెట్ అయ్యే మల్టీ-ఇన్‌పుట్, ఫీచర్లతో ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Related News

విడుదలకు ముందే Vivo X500 సిరీస్, Watch GT 2 ధరలు లీక్.. ఈసారి బడ్జెట్ గట్టిగానే పెట్టాలి!

ఫేస్ అన్‌లాక్ వెనుక ఇంత పెద్ద తంతంగం నడుస్తోందా? చీకట్లోనూ పనిచేసే ఆ 5 టెక్నాలజీలు ఇవే!

ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేయండి.. దాని జాతకమంతా బయటపడుతుంది!

గీజర్ Vs వాటర్ హీటర్..ఏది వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది?

కస్టమర్లతో కనెక్ట్ అవ్వడం ఇక మరింత ఈజీ.. Vi Business నుంచి ఏఐ ఆధారిత వాట్సప్ సేవలు!

కరెంట్ పోతే ఇన్వర్టర్‌పై ఫ్యాన్,టీవీ ఎన్ని గంటలు నడుస్తాయి? పూర్తి వివరాలివిగో!

Big Stories

Advertisement
×