BigTV English

Samsung Galaxy Z Fold 6 : పెద్ద డిస్​ప్లేతో ఇండియాలోకి సామ్ సాంగ్ స్పెషల్ ఎడిషన్ – ప్రీ ఆర్డర్​, స్పెసిఫికేషన్స్​ లీక్​

Samsung Galaxy Z Fold 6 : పెద్ద డిస్​ప్లేతో ఇండియాలోకి సామ్ సాంగ్ స్పెషల్ ఎడిషన్ – ప్రీ ఆర్డర్​, స్పెసిఫికేషన్స్​ లీక్​

Samsung Galaxy Z Fold 6 : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ సామ్ సాంగ్ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ సిరీస్ ఫోన్లను మార్కెట్​లోకి విడుదల చేసి గ్యాడ్జెట్ ప్రియులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ నుంచి త్వరలోనే లాంఛ్​ కానున్న స్మార్ట్ ఫోన్ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్ 6 స్లిమ్ (గెలాక్సీ జెడ్ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్). ఈ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్లిమ్ గురించి ఇప్పటికే చాలా ప్రచారం సాగుతోంది. ఈ స్మార్ట్ ఫోన్​ ఇతర ఫోన్లకు భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


తాజాగా ఈ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్లిమ్ గురించి ఓ పోస్టర్ లీక్ అయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్​ ఈ నెల చివర్లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుందట. అది కూడా సౌత్ కొరియాలో. అయితే ఈ స్పెషల్ ఎడిషన్​ స్మార్ట్ ఫోన్​ ఇండియాలో కూడా లాంఛ్ కానున్నట్లు తెలిసింది. శామ్​ సాంగ్​ ఇండియా వెబ్​సైట్​లో లిస్టింగ్​లో ఉంది. త్వరలోనే భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్​ 6 స్పెషల్ ఎడిషన్​ ప్రీ ఆర్డర్​, రిలీజ్ డేట్ – ఈ సామ్ సాంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్​ 6 స్పెషల్ ఎడిషన్​ ప్రీ ఆర్డర్​, రిలీజ్ డేట్ కూడా లీక్ అయింది. దక్షిణ కొరియాలో లీక్ అయిన పోస్టర్​ ప్రకారం… ఈ పోస్టర్​ను ఓ రిటైలర్​ పోస్ట్ చేశాడు. దీని ప్రీ ఆర్డర్స్ అక్కడ అక్టోబర్ 18 నుంచి 24 మధ్యలో ఉంటాయని అందులో ఉంది. ఇక అక్టోబర్ 25 తర్వాత అఫీషియల్​గా మార్కెట్​లోకి రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రీ ఆర్డర్​ కన్నా ముందు రిలీజ్ డేట్​ను అనౌన్స్​ చేసే అవకాశం ఉంది. ఇక ఈ పోస్ట్ తో సామ్ సాంగ్ జెడ్ ఫోల్డ్ 6 త్వరలోనే స్పెషల్ ఫీచర్స్ తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.


ALSO READ : అదిరే ఆఫర్.. రూ.37,000 ల్యాప్టాప్ కేవలం రూ.10,000కే!

ఇండియా లిస్టింగ్​లో జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్​ – ఈ స్మార్ట్ ఫోన్​ సౌత్ కొరియా, చైనాతో పాటు లిమిటెడ్ మార్టెట్స్​లో మాత్రమే విడుదల కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. స్పెషల్ వైట్​, క్రాఫ్టెడ్​ బ్లాక్​ కలర్స్​లో అందుబాటులో ఉండనుందట. అలాగే శామ్ ​సంగ్ ఇండియా వెబ్​సైట్​లో ఈ స్మార్ట్ ఫోన్​ గురించి ఓ పేజ్​ను డేడికేట్ చేసి సమాచారాన్ని పొందుపరిచారు. కాబట్టి ఇక్కడ కూడా దీన్ని విడుదల చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ స్పెషిఫికేషన్స్​ – ఈ స్మార్ట్ ఫోన్​ రెగ్యులర్ మోడల్​తో పోలిస్తే స్లిమ్​గా ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 తో పోలిస్తే దీని స్క్రీన్ సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది. 8 అంగులాల ప్రైమరీ డిస్ ప్లేతో, 6.5 ఇంచ్ కవర్​ స్క్రీన్​తో ఉంటుంది. కాగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 6.3 ఇంచ్ కవర్ డిస్​ ప్లేతో పాటు 7.6 ఇంచ్​ మెయిన్ డిస్ ​ప్లేతో వచ్చింది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×