India vs Bangladesh, 2nd Test WIN India won by 7 wkts: బంగ్లాదేశ్ ను టీం ఇండియా చిత్తు చేసింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా… రెండవ టెస్టులో కూడా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. రెండు టెస్టుల్లో భాగంగా.. ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్… నాగిని డాన్స్ కు బ్రేక్ వేసింది రోహిత్ సేన. రెండవ టెస్టులో ఏడు వికెట్ల తేడాతో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండవ ఇన్నింగ్స్ లో 95 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించింది టీమిండియా.
ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించడమే కాకుండా…. రెండు మ్యాచ్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. వర్షం కారణంగా రెండవ టెస్టు లో రెండు రోజులపాటు.. ఆట రద్దయినా కూడా… టీమిండియా గెలవడం హిస్టరీ అని చెప్పవచ్చు. ఈ రెండవ ఇన్నింగ్స్ లో 95 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.2 ఓవర్లలోనే చేదించింది టీమిండియా.
ALSO READ: Ind vs Ban Test: ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్న రోహిత్.. చెవులు పట్టుకున్న పంత్ !
రెండవ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులు, గిల్ ఆరు పరుగులకు అవుట్ అయ్యారు. కానీ జైస్వాల్ అలాగే విరాట్ కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చారు. జైస్వాల్ ఈ మ్యాచ్లో 51 పరుగులతో రాణించాడు. అటు విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చి 29 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇక అంతకుముందు బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 233 పరుగులకే చాప చుట్టేసింది. 74 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్… ఆల్ అవుట్ అయింది.
Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !
బంగ్లాదేశ్ బ్యాటర్లలో మూవీనుల్ ఒక్కడే 107 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు రెండవ ఇన్నింగ్స్ లో 146 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్. అప్పుడు సద్మాన్ ఇస్లాం మాత్రమే 50 పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా రాణించకపోవడంతో బంగ్లాదేశ్.. 146 పరుగుల వద్ద ఆగిపోయింది. అటు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో… టి20 మ్యాచ్ లాగా ఆడి… 285 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో.. 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.