BigTV English

Saudi Arabia: సౌదీ అరేబియా కొత్త బిజినెస్..చమురు, హజ్ కాదు, అంతకు మించి..

Saudi Arabia: సౌదీ అరేబియా కొత్త బిజినెస్..చమురు, హజ్ కాదు, అంతకు మించి..

Saudi Arabia: చమురుతో ప్రపంచాన్ని వణికించిన సౌదీ అరేబియా ఇప్పుడు మరో వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తోంది. కానీ అది చమురు రంగం కాదు, మతపర్యాటకం హజ్ కూడా కాదు. ఇప్పుడు ఈ అరబ్ రాజ్యం సంపాదనకు మరో కొత్త మార్గం బాట పట్టింది. అదే సినిమా రంగం. ఇన్నాళ్లూ చమురు గడ్డగా, హజ్, రియు ఉమ్రా వంటి మతపర్యాటకంతో మాత్రమే గుర్తింపు పొందిన సౌదీ అరేబియా, ఇప్పుడు పూర్తిగా తన రంగు మారుస్తోంది. విజన్ 2030 పేరుతో దేశాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో యువ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. వాటిలో ప్రధానమైంది..సినిమా రంగాన్ని ప్రారంభించడం.


సినిమా తలుపులు తెరిచిన అరేబియా
ఒకప్పుడు అక్కడ సినిమాలు నిషిద్ధం. సినిమా థియేటర్లే లేకపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ రోజుకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుండటం, బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టటం చూస్తుంటే ‘ఇది అదే సౌదీయేనా అనిపిస్తుంది. 2025 మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం, సౌదీ సినిమా థియేటర్లలో ప్రదర్శించిన సినిమాలు మొత్తం 127 మిలియన్ సౌదీ రియాల్స్ (అంటే దాదాపు రూ.280 కోట్లు) సంపాదించాయి.

వినోదం, ఆదాయం
ఇది గత ఏడాది (2024) మొదటి త్రైమాసికంతో పోలిస్తే 4% వృద్ధి అని అక్కడి సినిమా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ హనీ అల్ ముల్లా తెలియజేశారు. ఇది చిన్న సంఖ్య కాదు. ఇది ఒక అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌కు మైలురాయి లాంటి అంకె. కేవలం వినోదం కోసమే కాదు, ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా మారుతోంది.


Read Also: YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ …

పెట్టుబడి వ్యర్థం కాదు
భారీగా టికెట్ ట్యాక్స్, సినిమా ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బు, ఎగుమతి అయ్యే ఫిలింస్ ద్వారా వచ్చే విదేశీ మారకద్రవ్య ఆదాయం ఇవన్నీ కలిపి సినిమా రంగం ఇప్పుడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం వ్యర్థం కాదు. సౌదీ యువత ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్‌ని ఆదరిస్తోంది. స్థానిక చిత్రాలు కూడా మార్కెట్‌లో చోటు సంపాదిస్తున్నాయి. ఇది కల్చరల్ డైవర్సిటీకి నిదర్శనం మాత్రమే కాదు, దేశం మారుతున్నదనే దానికి సంకేతం కూడా.

విజన్ 2030
సౌదీ అరేబియాను నవయువక రాజ్యంగా తీర్చిదిద్దాలన్నదే ‘విజన్ 2030’ ఉద్దేశం. ఇందులో భాగంగానే ఎన్నో రంగాల్లో దేశాన్ని మలుపుతిప్పే విధానాలు తీసుకొస్తున్నారు MBS. మహిళల హక్కులకు అనుకూలంగా చర్యలు, విదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానించడం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగానికి పెట్టుబడులు ఇలా అనేక మార్పుల్లో ‘సినిమా’ ఒక అద్భుతమైన ఆరంభం అయ్యింది. సాంప్రదాయాల దృక్పథాన్ని మార్చుతూ, ఒక కొత్త చీకటి నుంచి వెలుగు దిశగా అడుగులు వేస్తోంది ఈ రాజ్యం.

ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌కు…
ఇప్పటికీ సౌదీ అరేబియా ప్రపంచంలోని ముస్లింలకు పవిత్ర స్థలమే. కానీ ఈ దేశం ఇప్పుడు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా కూడా నిలుస్తోంది. సౌదీలో ఇప్పుడు మ్యూజిక్ ఫెస్టివల్స్, కాంసర్ట్స్, సినిమా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ప్రపంచ ప్రముఖులు ఇక్కడకి రావడం, స్థానిక కళాకారులకు అవకాశాలు పెరగడం చూస్తుంటే ఈ మార్పు శాశ్వతమైపోతుందని అర్ధమవుతోంది. ఇది ఒక మామూలు పరిణామం కాదు. ఒక తరం ఆలోచనలే మార్చిన మలుపు అని చెప్పవచ్చు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×