BigTV English

YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ నీది..యూట్యూబ్‌లో క్రియేటర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్

YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ నీది..యూట్యూబ్‌లో క్రియేటర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్

YouTube AI Music Tool: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ ఓ క్రియేటర్‌ ఉన్నారని చెప్పవచ్చు. అనేక మంది కూడా ఏదో ఒక వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది వ్లాగ్స్, ఇంకొంత మంది షార్ట్‌ ఫిల్మ్‌ ఇలా అనేక రకాల వీడియోలు చేస్తుంటారు. అయితే వీటిలో ప్రత్యేకంగా ఉండేది మ్యూజిక్‌ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ మ్యూజిక్‌ను కూడా మన చేతుల్లోకి తీసుకొచ్చింది యూట్యూబ్‌.


బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌

వీడియోలకి మనమే సంగీతం సృష్టించుకోవచ్చని ఎప్పుడైనా ఊహించామా? కానీ ఇప్పుడు అది నిజం అవుతోంది. టెక్నాలజీ విప్లవాత్మకంగా మారుతున్న ఈ కాలంలో, యూట్యూబ్‌ తీసుకొచ్చిన తాజా అప్‌డేట్‌ మనలోని సంగీత దర్శకుడిని వెలికితీస్తుంది. ఇక మీదట మన వీడియోలకి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను మనం మనమే డిజైన్‌ చేసుకోవచ్చు – అది కూడా ఎలాంటి వాయిద్యాలు లేకుండా, స్టూడియో లేకుండా… కేవలం AI ఆధారిత టూల్‌తో! ఈ కొత్త ఫీచర్‌ యూట్యూబ్ క్రియేటర్ల ప్రపంచంలో ఓ గొప్ప మార్పుకు నాంది పలుకనుంది.


యూట్యూబ్‌ AI మ్యూజిక్ ఫీచర్
ఇప్పటి వరకూ వీడియోలకు సరిపోయే సంగీతాన్ని పొందేందుకు క్రియేటర్లు అనేక వెబ్‌సైట్లలో మ్యూజిక్ కోసం వెతకాల్సి వచ్చేది. లైసెన్స్, కాపీరైట్, బడ్జెట్ ఇవన్నీ ఓ సమస్యే. కానీ ఇప్పుడు యూట్యూబ్ అందిస్తున్న ఈ కొత్త మ్యూజిక్ జనరేషన్ టూల్‌తో ఇవన్నీ ఇబ్బందులు ఉండవిక. ఈ ఫీచర్‌ “క్రియేటర్ మ్యూజిక్” ట్యాబ్‌లో భాగంగా యూట్యూబ్ స్టూడియోలో లభిస్తుంది. ప్రస్తుతం ఇది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ ఫీచర్‌ రోల్‌ కానుంది.

AIతో సంగీతాన్ని ఎలా రూపొందించాలి?
ఈ ఫీచర్‌ ఉపయోగించాలంటే మీరు “క్రియేటర్ మ్యూజిక్” ట్యాబ్‌లోకి వెళ్లాలి. అక్కడ “AI మ్యూజిక్ అసిస్టెంట్” అనే కొత్త సెక్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఒక చిన్న డెస్క్రిప్షన్ ఇవ్వాలి.

ఉదాహరణకు: ఒక ఉత్సాహంగా ఉన్న ట్రావెల్ వీడియోకి సరిపడే upbeat మ్యూజిక్ లేదా
“అనుభూతులతో నిండిన ఎమోషనల్ మూమెంట్స్ కోసం మెలోడిక్ బీజీమ్ లేదా
“టెక్ అన్‌బాక్సింగ్ వీడియోకి ఫ్యూచరిస్టిక్ ట్యూన్”
మీరు ఇలా వ్రాసిన ప్రాంప్ట్ ఆధారంగా AI మీకు ప్రత్యేకంగా ఒక మ్యూజిక్ ట్రాక్‌ను రూపొందిస్తుంది. ఇలాంటి ఫీచర్‌ను మీకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఇది ఎవరికీ ఉపయోగపడుతుంది?
ఈ టూల్ ప్రధానంగా కంటెంట్ క్రియేటర్ల కోసమే రూపొందించబడింది. వ్లాగర్లు, టెక్ రివ్యూవర్లు, కుకింగ్ వీడియోలు చేసే వారు, ట్రావెల్ వ్లాగర్లు ప్రతి వీడియో సృష్టికర్తకూ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ మాత్రమే కాదు. మీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన మ్యూజిక్. ఇకపై మీరు రోయల్టీ ఫ్రీ మ్యూజిక్ కోసం వెతకాల్సిన అవసరం లేదు.

ఈ మ్యూజిక్ అసిస్టెంట్ వెనుక ఉండే టెక్నాలజీ
యూట్యూబ్ ఈ AI మ్యూజిక్ టూల్ ఏ మోడల్ మీద పనిచేస్తోందో స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇది యూట్యూబ్ గూగుల్ జెమిని AI (Gemini) ఆధారంగా ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అసిస్టెంట్” భాగంలో జెమిని స్పార్కిల్ ఐకాన్ ఉన్నందున ఇది గూగుల్ జెమిని మోడల్‌తో వస్తుందని పక్కాగా చెప్పలేం. యూజర్ రాసే ప్రాంప్ట్‌లను యూట్యూబ్ 30 రోజులపాటు నిల్వ ఉంచుతుంది. దీని ఉద్దేశం యూజర్ల ప్రాంప్ట్‌లను విశ్లేషించి, మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వడం.

డేటా గోప్యతపై యూట్యూబ్ హామీ
ఎప్పటికప్పుడు డేటా ప్రైవసీపై చర్చలు జరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, యూట్యూబ్ ఓ స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రాంప్ట్ డేటా కేవలం 30 రోజుల పాటు మాత్రమే నిల్వ చేయబడుతుంది. యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధంగానూ ఉల్లంఘించబోదని స్పష్టంగా తెలిపింది.

Read Also: Investment Tips: ఇందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. …

ఇప్పటి వరకూ ఉన్న క్రియేటర్ మ్యూజిక్ లైబ్రరీతో తేడా ఏమిటి?
-ఇప్పటికీ యూట్యూబ్‌ “క్రియేటర్ మ్యూజిక్” ట్యాబ్‌లో చాలా లైబ్రరీలు ఉన్నాయి. వీటిలో:
-బీపీయం (BPM)
-మూడ్
-వాయిస్ ఉండటంలేదా ఉండటం
-లెంగ్త్ (పొడవు)
-శైలి (genre)
ఇవన్నీ ఫిల్టర్‌ చేసుకుని సంగీతాన్ని ఎంచుకోవచ్చు. కానీ చాలా పాటలు చెల్లించాల్సినవే. ఇంకా ఏ సంగీతం మీకు సరిపోతుందో అంచనా వేయాలంటే బోలెడన్ని ట్రాక్‌లు వింటూ సమయం వృథా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఆలోచించేదాన్ని AI కచ్చితంగా గ్రహించి మ్యూజిక్‌గా మార్చేస్తుంది.

సాధారణ సృష్టికర్తలకు ఒక పెద్ద ఆస్తి
వీడియో ప్రొడక్షన్ ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్న క్రియేటర్లకు ప్రొఫెషనల్ మ్యూజిక్ తీసుకోవడం భారమే. అందుకే, యూట్యూబ్ ఇలాంటి AI టూల్‌ను ఉచితంగా అందించడమే ఒక గొప్ప ప్రయోజనం.
-చిన్న కంటెంట్ క్రియేటర్లకు ఇది గేమ్ చేంజర్
-ప్రొఫెషనల్ ఔట్‌పుట్ కావాలనుకునే వారికీ ఇది సరైన దారి
-బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో నూతనత కోరుకునే వారికోసం చక్కటి మార్గం

ఫ్యూచర్ లో ఇంకా ఏమి వస్తుందో?
ఇది ప్రారంభం మాత్రమే. గూగుల్ AIని క్రియేటివ్ వర్క్స్‌కి ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ఈ ప్రయోగం ఒక చిన్న నిడివి మాత్రమే. భవిష్యత్తులో:
-వాయిస్-ఓవర్ జనరేషన్
-కస్టమ్ సంగీతానికి వాయిస్ ఓవర్ యాడ్ చేయడం
-వీడియోకు లిప్-సింక్ మ్యూజిక్ తయారీ వంటి ఎన్నో కొత్త ఫీచర్లు రాబోతున్నాయి.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×