BigTV English

Become Crorepati: రోజుకు రూ.500 సేవింగ్..కోటి రూపాయల కల ఈజీగా సాకారం, ఎలాగంటే

Become Crorepati: రోజుకు రూ.500 సేవింగ్..కోటి రూపాయల కల ఈజీగా సాకారం, ఎలాగంటే

Become Crorepati: మీరు కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా. అద్భుతం! కానీ అది లాటరీ కాదు, జాక్‌పాట్ కాదు. మీ డిసిప్లెన్, ఓపిక, చిన్న చిన్న నిర్ణయాల ద్వారా దీనిని సాధించవచ్చు. ఉదాహరణకి, రోజూ మనం ఖర్చు చేసే రూ. 500 ఒక బిర్యానీ, చిన్న షాపింగ్ వంటి డబ్బును పక్కన పెట్టడం ప్రారంభిస్తే? కోటి పొందవచ్చు. ఇదే చిన్న అలవాటు, భవిష్యత్తులో పెద్ద సంపదగా మారవచ్చు. ఇది ఊహలు కాదు, గణాంకాలతో, నిజమైన రిటర్న్ లెక్కలతో చెప్పవచ్చు. సాధారణంగా మనం నిర్లక్ష్యం చేసే ఈ చిన్న మొత్తాలు, సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లలో వేస్తే, కొన్ని సంవత్సరాల్లో మీకు కోట్ల రూపాయలను తెచ్చిపెడతాయి. అది ఎలా సాధ్యం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


భద్రత కావాలంటే RD/FD
బ్యాంకుల రికరింగ్ డిపాజిట్లు (RD), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) అనేవి స్థిర మార్గాలు. వీటిలో రిస్క్ ఉండదు. రిటర్న్స్ కూడా పక్కాగా వస్తాయి. వీటిలో వడ్డీ 6% నుంచి 7% వరకు లభిస్తుంది.

ఉదాహరణ:
-మీరు రోజుకు రూ.500, నెలకు రూ.15,000ని RDలో 7% వడ్డీతో వేస్తే –
-20 సంవత్సరాల్లో: రూ.66 లక్షలు
-30 సంవత్సరాల్లో: రూ.1.5 కోట్లు లభిస్తాయి.
-కోటి రూపాయల కోసం 25-27 సంవత్సరాలు పడుతుంది.
-ప్రయోజనం రిస్క్ తక్కువ, వడ్డీ గ్యారంటీ.
-మైనస్ ద్రవ్యోల్బణం వల్ల రియల్ వాల్యూ తగ్గినట్లు అనిపించడం


Read Also: Flat Buying Mistakes: ఫ్లాట్ కొంటున్నారా జాగ్రత్త..పొరపాటున …

మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రతి నెలా సిస్టమాటిక్ గా పెట్టుబడి (SIP) చేయడం ఇప్పుడు యువతలో ట్రెండ్‌గా మారింది. దీనిలో 10% నుంచి 12% మధ్యలో వార్షిక రాబడి వచ్చే ఛాన్సుంది.

ఉదాహరణ: రూ.15,000 నెలకి SIP ద్వారా 12% రాబడితో:
-15 సంవత్సరాల్లో: రూ.76 లక్షలు
-20 సంవత్సరాల్లో: రూ. 1.5 కోట్లు
-కోటి రూపాయల కోసం 18-20 సంవత్సరాలు సరిపోతుంది.
-ప్రయోజనం ఎక్కువ రాబడి, మార్కెట్‌ను బాగా అర్థం చేసుకుంటే గెలుపే సాధ్యం
-రిస్క్: మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్‌టర్మ్‌లో ఒత్తిడికి గురవవచ్చు.

ధైర్యవంతుల దారి
మీకు స్టాక్ మార్కెట్‌పై విశ్వాసం, అవగాహన ఉంటే, ఈ రూట్ గోల్డ్ మైన్‌లా మారుతుంది. మంచి స్టాక్స్‌లో పెట్టుబడి చేస్తే 15% లేదా అంతకన్నా ఎక్కువ రాబడి రావొచ్చు.

-ఉదాహరణ: రూ.15,000 నెలకు, 15% రాబడితో:
-15 సంవత్సరాల్లో: రూ. 1.1 కోట్లు
-18 సంవత్సరాల్లో: రూ. 1.8 కోట్లు!
-సమయం: 1 కోటి చేరాలంటే 15-16 సంవత్సరాలే సరిపొతుంది
-ప్రయోజనం: అత్యధిక రాబడి
-రిస్క్: అధికం, కానీ జ్ఞానం, డిసిప్లిన్ ఉంటే భారీ లాభాలు.

భద్రత, పన్ను మినహాయింపు ఉన్న మార్గం
-పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఓ ప్రభుత్వ ఆధారిత స్కీమ్. ఇప్పటి వడ్డీ రేటు 7.1%.
-ఒక సంవత్సరం గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు.
-మీరు రూ.1.8 లక్షలు సేవ్ చేస్తున్నందున, మిగిలిన రూ.30,000ని ఇతర స్కీమ్‌లలో పెట్టాలి.

-ఉదాహరణ: 1.5 లక్షలు సంవత్సరానికి PPFలో ఇన్వెస్ట్ చేస్తే –
-25 సంవత్సరాల్లో: సుమారు రూ.1 కోటి అవుతుంది
-ప్రయోజనం: నిష్పత్తిగా భద్రమైన రాబడి, పన్ను మినహాయింపు.
-తక్కువ రిస్క్ కోరేవారికి.

ఏ దారి ఎంచుకోవాలి?
మీ లక్ష్యం “కోటి రూపాయల సంపద” అయితే మీరు తీసుకునే రిస్క్‌, మీ ఆర్థిక జ్ఞానం, పెట్టుబడి కాలవ్యవధి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×