BigTV English

Anchor Ravi : మళ్లీ అలా జరగదు.. వీడియో వదిలిన యాంకర్ రవి, సారీ చెప్పకుండానే..

Anchor Ravi : మళ్లీ అలా జరగదు.. వీడియో వదిలిన యాంకర్ రవి, సారీ చెప్పకుండానే..

Anchor Ravi : సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), యాంకర్ రవి కలిసి ఓ బుల్లితెర షోలో భాగంగా ఇటీవల చేసిన ‘బావగారు బాగున్నారా’ (Bavagaru Bagunnara) స్పూఫ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే హిందూ దేవుళ్ళపై ఇలాంటి చిల్లర స్కిట్లు ఏంటి ? అంటూ హిందూ సంఘాలు ఫైర్ అయ్యాయి. అంతేకాదు ఓ హిందూ సంఘం వ్యక్తికి, రవికి మధ్య ఈ వివాదం సంభాషణకు ఆడియో లీక్ అయ్యింది. ఆ వీడియో సంచలనం రేపడంతో తాజాగా యాంకర్ రవి వివాదం పై స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మరి అందులో రవి సారీ చెప్పాడా? అనే  వివరాల్లోకి వెళ్తే…


సారీ ప్రస్తావనే లేకుండా ముగించాడే… 

తాజాగా వివాదం గురించి రిలీజ్ చేసిన వీడియోలో యాంకర్ రవి మాట్లాడుతూ “అందరికీ నమస్కారం… రీసెంట్ గా నేను, ఇంకొంత మంది ఆర్టిస్టులు కలిసి సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ (Super Serial Championship) అనే ఒక ప్రోగ్రాం చేసాము. అందులో ఓ సినిమా స్పూఫ్ చేశాము. ఇది ఇంటెన్షనల్ గా ఎవరినో హర్ట్ చేద్దాం, లేదా హిందువులను, వాళ్ళ సెంటిమెంట్లను హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేయలేదు. ఓ రైటర్ ను పెట్టుకుని రాయించి చేసిన స్కిట్ కాదు ఇది. ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ ను ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. దీనివల్ల చాలామంది హిందువులు హర్ట్ అయ్యారని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి. ఇలా చేయడం తప్పని చెబుతున్నారు. ఇంకోసారి ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉంటాము. జైశ్రీరామ్, జైహింద్” అంటూ తన వివరణతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.


మరి రవి వీడియోతో ఈ వివాదం సద్దుమణుగుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఈ వీడియోలో రవి హిందూ సంఘాలు డిమాండ్ చేసినట్టుగా ఎక్కడా సారీ అని చెప్పలేదు. క్షమాపణలు కోరకుండానే మళ్లీ అలా జరగదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

హిందూ సంఘాల డిమాండ్ ఇదేనా ?

‘బావగారు బాగున్నారా’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నంది కొమ్ములలో నుంచి హీరోయిన్ ను చూసిన సీన్ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది. ఆ సినిమా హీరోయిన్ రంభ రీఎంట్రీకి అనుగుణంగా, తాజా షోలో అదే సీన్ ను రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు సుధీర్, రవి. ఎట్టకేలకు పిడి మాత్రం రవిపైనే పడింది. పర్సనల్ గా కాల్స్ చేసి మరీ హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడుతూ… రవి, సుధీర్ సారీ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశాయి హిందూ సంఘాలు.

Read Also : నీ సంగతి చూస్తాం.. యాంకర్‌ రవికి హిందూ సంఘాల వార్నింగ్, సుధీర్ వల్లే!

సుధీర్ ఇప్పటిదాకా ఈ విషయంపై పెదవి విప్పలేదు. కానీ రవికి, రాష్ట్రీయ హిందూ వానర సంఘం అనే ఆర్గనైజేషన్ వ్యక్తి కాల్ చేసి మాట్లాడిన ఆడియో నెట్టింట దుమారం రేపింది. కానీ లీకైన ఆ ఆడియోలో రవి తాను తప్పు చేయలేదని, సారీ చెప్పనని తేల్చి చెప్పాడు. దీంతో రవికి స్పందించక తప్పలేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఇంకోసారి జరగకుండా చూసుకుంటానని అన్నాడే తప్ప సారీ ప్రస్తావన లేదు. మరి ఇక్కడితో హిందూ సంఘాలు కూల్ అవుతాయా? ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? అన్నది చూడాలి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×