Oppo Pad 6 F Lite: టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోడల్ ట్యాబ్ గ్లోబల్ లాంచ్‌కు ముందే అధికారికంగా వార్తల్లో నిలిచింది. ఒప్పో రొమేనియా వెబ్‌సైట్‌లో.. ఈ కొత్త ట్యాబ్లెట్ లిస్ట్ అవ్వడంతో దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ప్రీమియం డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. పెద్ద స్క్రీన్, కళ్ళకు హాని చేయని డిస్‌ప్లే టెక్నాలజీ, రోజుల తరబడి వచ్చే 11,000mAh భారీ బ్యాటరీతో ఇది మార్కెట్‌లోకి రాబోతోంది. ముఖ్యంగా ..ఆన్‌లైన్ క్లాసులు వినే స్టూడెంట్స్, మూవీ లవర్స్ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. దీని పూర్తి ఫీచర్లు, అంచనా ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రీమియం మెటల్ డిజైన్ & బిల్డ్ క్వాలిటీ:
ఈ మోడల్ చాలా స్లిమ్‌గా, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటోంది. దీని మందం కేవలం 6.52 మిల్లీమీటర్లు మాత్రమే ఉండగా..బరువు 618 గ్రాములుగా ఉంది. దీనికి మెటల్ మిడ్-ఫ్రేమ్, ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఇచ్చారు. వెనక వైపు ఎడమ మూలలో సింగిల్ కెమెరా కటౌట్ వాడారు. ఈ ట్యాబ్ ప్రస్తుతం ఆకర్షణీయమైన ఫ్రాస్ట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో లిస్ట్ అయింది. పైభాగంలో పవర్ బటన్, కుడి వైపున వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి.
భారీ 12.6 ఇంచుల 2.4K ఐ-ప్రొటెక్షన్ డిస్‌ప్లే:
ఈ ట్యాబ్‌లో ప్రధాన ఆకర్షణ దీని డిస్‌ప్లే. ఇందులో 12.6 ఇంచుల Full-HD+ (1,600 x 2,400 పిక్సెల్స్) 2.4K LCD టచ్‌స్క్రీన్ అందించారు. 3:2 యాస్పెక్ట్ రేషియోతో రావడం వల్ల పుస్తకాలు చదవడానికి, డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్,720 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. కళ్లకు ఒత్తిడి కలగకుండా ఉండేందుకు TUV Rheinland సర్టిఫైడ్ లో-బ్లూ లైట్ , ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీని ఇందులో వాడారు.
ప్రాసెసర్, ర్యామ్ & లేటెస్ట్ సాఫ్ట్‌వేర్:
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బెస్ట్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. రోజువారీ మల్టీటాస్కింగ్, ఆన్‌లైన్ క్లాసులు, స్ట్రీమింగ్ కోసం ఇది వేగంగా పనిచేస్తుంది. ఇందులో 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ Android 17 ఆధారిత ColorOS 17 పై రన్ అవుతుంది.