E-Paper
Advertisement

మీరు ఫోన్‌ను వాడుతున్నారా? లేక మీ ఫోన్ మిమ్మల్ని వాడుకుంటోందా?

మీరు ఫోన్‌ను వాడుతున్నారా? లేక మీ ఫోన్ మిమ్మల్ని వాడుకుంటోందా?
Advertisement

Smartphone Privacy: ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు.. మనం దేని గురించి మాట్లాడితే దానికి సంబంధించిన యాడ్ మన ఫోన్‌లో వచ్చేస్తోంది.. మన మూడ్‌ను ఎవరికైనా చెప్పుకుంటే.. దానికి సంబంధించిన రీల్స్, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.. అంతేందుకు ఒకప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరిని కలుస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఏం కొంటున్నాం? మనకు ఏ విషయాలంటే ఇష్టం? ఇవన్నీ మనకు దగ్గరగా ఉన్నవాళ్లకు మాత్రమే తెలిసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన ఫోన్ మనం ఎక్కడున్నామో చెబుతుంది. మనం ఏం కొనాలనుకుంటున్నామో షాపింగ్ యాప్స్‌కు తెలుసు. మనకు ఏ విషయాలంటే ఇంట్రెస్టో సోషల్ మీడియాకు తెలుసు. మనం ఏం సెర్చ్ చేస్తున్నామో సెర్చ్ ఇంజిన్లకు తెలుసు. చివరికి మనం ఏ యాప్స్ వాడుతున్నామో కూడా కొన్ని యాప్స్ తెలుసుకునే అవకాశం ఉందంటే.. మనం ఫోన్‌ను ఉపయోగిస్తున్నామా? లేక మన ఫోన్ కంపెనీలకు ఉపయోగపడుతుందా? రీసెంట్‌గా అస్ట్రోటాక్, బ్లింకిట్ ఇష్యూస్.. ఇప్పుడు మనకు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి.. అవేంటో చూడ్డాం.

రివర్స్ ఇంజినీరింగ్ షాకింగ్ నిజాలు

Advertisement

అయితే ఈ వివాదంలోకి వెళ్లే ముందు ఒక టెక్నికల్ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే రివర్స్ ఇంజినీరింగ్. సాధారణంగా ఒక యాప్ తయారు చేయాలంటే డెవలపర్లు కోడింగ్ చేస్తారు. ఆ కోడ్ ఆధారంగా మనకు కనిపించే యాప్ తయారవుతుంది. కానీ రివర్స్ ఇంజినీరింగ్‌లో దీనికి కంప్లీట్‌ రివర్స్ అన్నమాట. ఇప్పటికే తయారైన యాప్‌ను తీసుకుని.. దాని లోపల ఉన్న కోడ్‌ను అనలైజ్ చేస్తారు. అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏయే పర్మిషన్లు ఉపయోగిస్తున్నారు? ఎలాంటి డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంది? యాప్ ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను తెలుసుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక ఇంటిని బయట నుంచి చూసి ఆగిపోకుండా, దాని బ్లూప్రింట్‌ను పరిశీలించి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. ఇప్పుడు ఇదే పద్ధతిలో ఒక యాప్‌ను విశ్లేషిస్తే ఎలాంటి విషయాలు బయటపడవచ్చో చూద్దాం. AstroTalk ఆండ్రాయిడ్ యాప్‌ను రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో అలానే అనలైజ్ చేశౄరు మార్కెటింగ్ కన్సల్టెంట్ ప్రతమేశ్ భోస్లే. అప్పుడు ఆ యాప్‌లో మరో 244 అప్లికేషన్లకు సంబంధించిన లిస్ట్ కనిపించింది. Tinder, Bumble, Hinge, Shaadi.com వంటి డేటింగ్, మ్యాట్రిమోనీ యాప్స్.. జీరో దా, Groww వంటి ట్రేడింగ్ యాప్స్.. Dream11, PokerStars వంటి గేమింగ్ యాప్స్.. బ్యాంకింగ్, లోన్ యాప్స్.. చివరికి ChatGPT కూడా ఆ లిస్ట్‌లో ఉంది.

బ్లింకిట్ యాప్‌పై ఆరోపణలు..

Advertisement

అంటే మీ ఫోన్‌లో Tinder ఉంటే మీ డేటింగ్ ఆసక్తుల గురించి.. Groww ఉంటే మీ ట్రేడింగ్ అలవాట్ల గురించి.. లోన్ యాప్స్ ఉంటే మీ ఆర్థిక అవసరాల గురించి కొన్ని అంచనాలు వేసే అవకాశం ఉంటుంది. బ్లింకిట్ యాప్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే. ఇన్‌స్టాగ్రామ్, జోమాటో వంటి 21 యాప్స్‌ను చెక్ చేయడం, Wi-Fi పేర్లు, GPS లొకేషన్, బ్యాటరీ లెవల్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్‌ను యాక్సెస్ చేయడం వంటి విషయాలు బయటపడ్డాయి. ఇదే క్వశ్చన్‌ను అడిగితే.. ప్రైవసీ పాలసీలో ఈ విషయాలన్ని చెప్పామంటారు.

ఫ్రీ యాప్స్ వెనుక ఉన్న అసలు వ్యాపారం ఇదే!

ఇక్కడ ప్రతి యాప్ ప్రతి డేటాను కలెక్ట్ చేయదు. కొన్ని యాప్స్ లొకేషన్ తీసుకుంటాయి. మరికొన్ని కెమెరా, మైక్రోఫోన్ యాక్సెస్ అడుగుతాయి. ఇంకొన్ని కాంటాక్ట్స్, ఫొటోలు, ఫైల్స్ వంటి వివరాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ డెలివరీ యాప్‌కు మీ లొకేషన్ అవసరం కావచ్చు. వీడియో కాలింగ్ యాప్‌కు కెమెరా, మైక్రోఫోన్ అవసరం కావచ్చు. కానీ ఒక నార్మల్‌ యాప్‌కు మీ కాంటాక్ట్స్ ఎందుకు? మీ లొకేషన్ నిరంతరం ఎందుకు? మీ ఫోన్‌లోని ఇతర యాప్స్ వివరాలు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంది. Google కూడా Android 11 నుంచి ఇతర యాప్స్‌ను గుర్తించే విషయంలో కొన్ని బౌండరీస్‌ను విధించింది. క్వెరీ ఆల్ ప్యాకేజేస్‌ అనే స్పెషల్ పర్మిషన్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ వివరాలను తెలుసుకోవచ్చు. కానీ Google Playలో ఈ పర్మిషన్‌ను ప్రతి యాప్‌కు ఇవ్వరు. దానికి సరైన రీజన్‌ ఉండాలి. అంటే మన ఫోన్‌లో ఉన్న ప్రతి యాప్‌కు మన డిజిటల్ లైఫ్‌ను చూసే హక్కు లేదన్నమాట.

మీ ఫోన్‌కు మీ రహస్యాలన్నీ తెలుసా?

ఇప్పుడు అసలు ప్రమాదం ఎక్కడుందో చూద్దాం. ఒక యాప్‌కు మీ లొకేషన్ తెలుసు. మరో యాప్‌కు మీ షాపింగ్ అలవాట్లు తెలుసు. ఇంకో యాప్‌కు మీ సెర్చ్ హిస్టరీ తెలుసు. ఈ సమాచారమంతా వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు ఒక లెవల్‌ వరకు మాత్రమే మీ గురించి తెలుస్తుంది. కానీ ఇలాంటి డేటా పాయింట్లు కలిసినప్పుడు మీ ఇంట్రెస్టులు, అలవాట్లు, ప్రయాణాలు, కొనుగోలు విధానాలు, లైఫ్ స్టైల్‌ గురించి మరింత క్లియర్‌ డిజిటల్ ప్రొఫైల్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇదే డేటా ఎకానమీ.

మాట్లాడితే యాడ్స్, చూస్తే రీల్స్..

మన ఇన్ఫో ఆధారంగా మనకు యాడ్స్‌ చూపించడం, మన ఇంట్రెస్టులకు అనుగుణంగా సర్వీసులు అందించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదే టైమ్‌లో అనవసరమైన ప్రొఫైలింగ్, డేటా మిస్‌యూస్, మోసాలు జరిగే ప్రమాదాలూ ఉన్నాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్‌ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023తో పాటు 2025లో DPDP Rulesను తీసుకొచ్చింది. పర్సనల్ డేటా సేకరణ, వినియోగం విషయంలో సంస్థలకు బాధ్యతలు, వ్యక్తులకు హక్కులు కల్పించడమే వీటి ఉద్దేశం.

అసలు మన డేటా ఎక్కడికి వెళ్తోంది?

ఒక్కసారి మళ్లీ పాత రోజులను గుర్తుచేసుకోండి. అప్పట్లో మనకు ఫోన్ అంటే మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. కానీ ఇప్పుడు అదే ఫోన్ మన బ్యాంక్.. మన ఆఫీస్.. మన షాపింగ్ మాల్.. మన ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్.. చివరికి మన పర్సనల్ డైరీ కూడా. టెక్నాలజీ వల్ల మన ఈజీగా మారింది. ఎన్నో పనులు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ప్రపంచం మన చేతుల్లోకి వచ్చింది. కానీ ఈ సౌకర్యాల కోసం మన పర్సనల్‌ డేటాను ఎంత వరకు వదులుకుంటున్నాం? మనకు తెలియకుండానే మన డేటా సేకరిస్తున్నారా? మన ప్రైవసీని నిజంగా రెస్పెక్ట్ చేస్తున్నారా? అసలు మన డేటా ఎక్కడికి వెళ్తోంది? దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? అనేది తెలుసుకునే చాన్స్ కూడా ఉండటం లేదు. స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంలో సాధించిన గొప్ప డెవలప్‌మెంటా? లేక మన పర్సనల్‌ లైఫ్‌ని డేటాగా మార్చేస్తున్న కొత్త వ్యాపారమా? ఇప్పుడు దీనిపైనే క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: స్టూడెంట్స్,ఆఫీస్ వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్..అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ

Tags

Related News

స్టూడెంట్స్,ఆఫీస్ వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్..అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ

డెవలపర్లు, క్రియేటర్ల కోసం హెచ్‌పీ సూపర్ ఏఐ ల్యాప్‌టాప్ విడుదల

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ షురూ..స్మార్ట్‌ఫోన్లు,గాడ్జెట్లపై కళ్లు చెదిరే ఆఫర్లు

మాప్ తానే ఉతికి ఆరబెట్టుకునే రోబో వాక్యూమ్ క్లీనర్..హైయర్ సివిక్ ఏఐ మ్యాక్స్ లాంచ్!

నథింగ్ బడ్స్‌కు చెక్ పెట్టేలా JBL కొత్త స్ట్రాటజీ..ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కొత్త మోడల్ లాంచ్!

మీ ఇంటినే..మూవీ హాల్‌గా మార్చే బెస్ట్ వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్

కరెంట్ బిల్లు సగానికి తగ్గించే టాప్ 5 స్టార్ గీజర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరల్లో భారీ తేడా ఇదే!

Big Stories

Advertisement
×