Noise Buds E1 V2: బడ్జెట్ ధరలో.. బెస్ట్ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. నాయిస్ కంపెనీ అందిస్తున్న ఈ మోడల్ మీకు ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. సాధారణంగా రూ.1,000లోపు ఉండే ఇయర్ బడ్స్ ప్లాస్టిక్ ఫినిషింగ్‌తో సాదా సీదాగా కనిపిస్తాయి. కానీ..నాయిస్ ఈ మోడల్ విషయంలో.. డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికి ఇచ్చిన పెబుల్ గ్రెయిన్ డిజైన్ చూడటానికి చాలా క్లాసీగా, చేతిలో పట్టుకోవడానికి.. మంచి గ్రిప్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. చార్కోల్ బ్లాక్, కోబాల్ట్ బ్లూ, డ్యూన్ బీజ్ వంటి లేటెస్ట్ రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. చెవిలో.. పెట్టుకున్నప్పుడు ఏమాత్రం బరువు అనిపించకుండా.. రోజంతా కంఫర్ట్‌గా ఉండేలా ఎర్గోనామిక్ ఫిట్‌తో వీటిని తయారు చేశారు.
తక్కువ ధర కదా అని సౌండ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో 10 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించారు. దీనివల్ల మూవీస్ చూసేటప్పుడు, పాటలు వినేటప్పుడు డీప్ బేస్, స్పష్టమైన వోకల్స్ వినిపిస్తాయి. ఇక కాల్స్ మాట్లాడేవారి.. కోసం ఇందులో క్వాడ్ మైక్ ఈఎన్సీ టెక్నాలజీని ఇచ్చారు. మీరు ట్రాఫిక్‌లో ఉన్నా లేదా రద్దీ ప్రదేశాల్లో ఉన్నా, బయటి సౌండ్స్ తగ్గించి అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపించేలా ఈ నాలుగు మైకులు పనిచేస్తాయి.
ఇయర్‌బడ్స్ కొనేటప్పుడు అందరూ ప్రధానంగా ..చూసేది బ్యాటరీ బ్యాకప్. ఈ మోడల్ ఈ విషయంలో అంచనాలను మించిపోయింది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే కేవలం ఇయర్‌బడ్స్ ద్వారానే ఏకంగా 13 గంటల వరకు నాన్ స్టాప్ ప్లేటైమ్ లభిస్తుంది. ఇక ఛార్జింగ్ కేస్‌తో కలిపి.. మొత్తం 35 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, ప్రయాణాల్లో.. తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు.దీనికి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో దాదాపు 100 నిమిషాల వరకు పాటలు వినే వీలుంది.
గేమింగ్, కనెక్టివిటీ ఫీచర్లు:
గేమ్స్ ఆడే వారి కోసం ఇందులో ప్రత్యేకంగా లో లేటెన్సీ మోడ్ అందించారు. దీని వల్ల గేమ్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో మధ్య ఎటువంటి లాగ్ లేకుండా సింక్ అవుతుంది. కనెక్టివిటీ కోసం.. లేటెస్ట్ బ్లూటూత్ 5.3 వెర్షన్ ఇచ్చారు. ఇది 10 మీటర్ల వైర్‌లెస్ రేంజ్ వరకు స్థిరమైన కనెక్షన్‌ను అందిస్తుంది. దీనికి.. ఉన్న హైపర్ సింక్ టెక్నాలజీ వల్ల ఛార్జింగ్ కేస్ మూత తెరవగానే.. క్షణాల్లో మీ ఫోన్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా.. జిమ్‌లో వర్కవుట్లు చేసే వారికి, వర్షంలో తడిచినా పాడవకుండా ఉండేందుకు IPX5 వాటర్, స్వెట్ రెసిస్టెంట్ రేటింగ్ కూడా ఉంది. బడ్స్ పై ఉండే టచ్ కంట్రోల్స్ ద్వారా పాటలు మార్చడం, కాల్స్ లిఫ్ట్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం చాలా ఈజీ.
Also Read: స్టూడెంట్స్,ఆఫీస్ వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్..అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎంట్రీ
కంపెనీ ఈ ఇయర్‌బడ్స్ అసలు ధరను రూ.3,499 గా నిర్ణయించింది. సాధారణ రోజుల్లో రిటైల్ , ఆన్‌లైన్ మార్కెట్లో ఇవి రూ.1,099 నుంచి రూ.1,399 మధ్య అమ్ముడవుతున్నాయి. అయితే.. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక సేల్ మరియు డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా కేవలం రూ.799 కే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఒక సంవత్సరం బ్రాండ్ వారంటీతో వస్తున్న ఈ బడ్స్, రూ.800 బడ్జెట్‌లో స్టైల్, బ్యాటరీ , క్లియర్ కాలింగ్ కోరుకునే విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక చక్కటి డీల్ అని చెప్పొచ్చు.