E-Paper
Advertisement

భారీగా బంగారం-వెండి ఈటీఎఫ్‌లు పతనం.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాల సెగ!

భారీగా బంగారం-వెండి ఈటీఎఫ్‌లు పతనం.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాల సెగ!
Advertisement

Gold ETF Crash: ప్రపంచ మార్కెట్లో బులియన్ ధరలు పతనం కావడంతో బంగారం-వెండి ఈటీఎఫ్‌లు 7.5 శాతం వరకు పడిపోయాయి. అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, పెరుగుతున్న బాండ్ దిగుబడులు, మార్కెట్ అస్థిరత కారణంగా విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచాయి. అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు నష్టాల సెగ తప్పలేదు.

భారీగా బంగారం-వెండి ఈటీఎఫ్‌లు పతనం

బంగారం, వెండి ధరలు పతనం కావడంతో దాని ప్రభావం గోల్డ్‌-సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌‌పై పడింది. లోహాల ధరలు భారీగా పతనం కావడంతో ఈటీఎఫ్‌లు దాదాపు 9 శాతం మేరా క్షీణించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో నమోదైన గరిష్ఠాల నుంచి బంగారం, వెండి ధరలు తీవ్రంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌-SIPను కొనసాగించాలా? పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపి వేయాలా? అనే దానిపై ఆలోచనలో పడ్డారు.

ఇన్వెస్టర్లకు నష్టాల సెగ! సిప్ నుంచి డ్రాప్

Advertisement

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. నవంబర్ 20 నాటికి వెండి ఈటీఎఫ్‌లు సగటున సుమారు 5.6 శాతం తగ్గుదల నమోదు చేసింది. బంగారం ఈటీఎఫ్‌లు దాదాపు 4.5 శాతానికి పడిపోయింది. గోల్డ్ సిప్‌‌లో యాక్సిస్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఇన్వెస్కో ఇండియా గోల్డ్‌ ఈటీఎఫ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఛాయిస్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు సంబంధించి దాదాపు 6 శాతం పతనమయ్యాయి. మిగతా ఈటీఎఫ్‌లూ దాదాపు 5 శాతం పైగానే దిగొచ్చాయి.

ఎస్‌బీఐ సిల్వర్‌ ఈటీఎఫ్‌ శుక్రవారం ఓ దశలో దాదాపు 9 శాతం మేరా పడిపోయింది అటు హెచ్‌డీఎఫ్‌సీ సిల్వర్‌ ఈటీఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌, నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ లు అయితే దాదాపు 7 శాతానికి పడిపోయాయి. నవంబర్ 20 నాటికి బంగారం తన గరిష్ఠ స్థాయి నుండి 35 శాతానికి పైగా పడిపోయింది. అటు వెండి సుమారు 66 శాతం మేరా క్షీణించింది. బంగారం – వెండి ఈటీఎఫ్ పెట్టుబడిదారులు తమ విలువైన లోహాల కేటాయింపులను పునఃసమీక్షించుకునేలా ప్రేరేపిస్తోంది. చాలామంది చిన్న పెట్టుబడిదారులు సిప్ నుంచి డ్రాపవుతున్నారు.

Advertisement

ALSO READ: బంగారం, వెండి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? మన దేశంలో రేట్లు ఎలా ఫిక్స్ అవుతాయో తెలుసా?

తగ్గుదల డిమాండ్ బలహీనపడటానికి సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకులు మూడో త్రైమాసికంలో 321 టన్నులు కొనుగోలు చేశాయని నివేదికలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 42 శాతం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్‌ల నిల్వలు రికార్డు స్థాయిలో అంటే 4256 టన్నులకు చేరాయి. భారతీయ పెట్టుబడిదారులు అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో సుమారు రూ. 3000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అటు సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో అదే స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

రూ.55 వేలకు బంగారం ఢమాల్.. 11 నెలల్లో ఇంత మార్పా? 1981 మళ్లీ రిపీట్?

బంగారం, వెండి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? మన దేశంలో రేట్లు ఎలా ఫిక్స్ అవుతాయో తెలుసా?

భారత్ దగ్గర వేల కోట్ల విలువైన బంగారం.. ఎక్కడ దాచిపెడతారో తెలుసా?

బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజు రూ. 5 వేలకు పతనం! ధరలు ఎలా ఉన్నాయి.

EPFOలో కీలక మార్పులు.. ఇకపై ప్రతి నెలా జీతం PF నుంచే, ఖాతాలో కనీస నిల్వలు తగ్గింపు

రూ.5 లక్షలు సేవింగ్స్ ఉంటే పెట్టుబడి కోసం ఇలా ప్లాన్ చేయండి.. చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సూచనలు

ఒక్క చోటే అంత బంగారమా? ఏకంగా ఏడు లక్షల కోట్లు.. లక్ అంటే వాళ్లదే!

Big Stories

Advertisement
×