Seedream 4.0| డిజిటల్ ప్రపంచంలో AI ద్వారా సృష్టించబడే ఫొటోలు ఊహించని మార్పుని తీసుకొచ్చాయి. భారతదేశంలో జెమిని AI టూల్ అయిన నానో బనానా ఫోటో ట్రెండ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్రెండ్‌లో యూజర్లు సాంప్రదాయ దుస్తుల్లో తమను తాము అత్యంత ఆకర్షణీయంగా చూపే ఫొటోలను సృష్టిస్తున్నారు. అయితే, ఈ ఫొటోల వల్ల డేటా దుర్వినియోగం గురించి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
నానో బనానా AI టూల్ తక్కువ ఇన్‌పుట్‌తో అత్యంత వివరణాత్మక ఇమేజ్‌లను సృష్టిస్తుంది. కానీ, ఈ రంగంలో కొత్త పోటీదారుగా టిక్‌టాక్ కంపెనీ బైట్‌డాన్స్ ఒక్కసారిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
బైటెడాన్స్ కంపెనీ తమ సీడ్రీమ్ 4.0 ఏఐ ఇమేజ్ క్రియేటివ్ టూల్‌ని విడుదల చేసింది. ఈ టూల్ గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్‌ను మించిన బెంచ్‌మార్క్ స్కోర్‌లతో AI క్రియేటివిటీతో విప్లవం తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉంది.
సీడ్రీమ్ 4.0 ముఖ్యమైన ఫీచర్లు
బైట్‌డాన్స్ సీడ్రీమ్ 4.0ని నానో బనానా AIకి గట్టి పోటీగా పరిచయం చేసింది. ఈ టూల్… డిజైనర్లు, మార్కెటర్లు, ఫిల్మ్ మేకింగ్ క్రియేటర్ల కోసం రూపొందించబడింది. ఇది రెండు సెకన్లలోపు హై క్వాలిటీ ఇమేజ్‌లను సృష్టిస్తుంది. ఇమేజ్ క్రియేట్ చేయడానికి కావాలంటే యూజర్లు ఆరు రిఫరెన్స్ ఇమేజ్‌లను ఉపయోగించగలరు. ఈ ఫీచర్లు.. స్టోరీబోర్డింగ్, ఉత్పత్తి డిజైన్, సినిమా నిర్మాణంలో స్థిరత్వం కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
సీడ్రీమ్ 4.0 కేవలం ఇమేజ్‌లను సృష్టించడమే కాకుండా.., సహజ భాషలో ప్రాంప్ట్‌ల ద్వారా కచ్చితమైన ఎడిటింగ్‌ను కూడా అందిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి యూజర్లు సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌లను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మార్చడం, ఇతర డిటైల్స్ జోడించడం లేదా రంగులను సవరించడం వంటి మార్పులను వివరించడం ద్వారా సులభంగా ఎడిట్ చేయవచ్చు.
ఈ AI టూల్ ఇమేజ్ లోని సూక్ష్మ వివరాలను కాపాడుతూ శుభ్రమైన ఎడిటింగ్‌ను అందిస్తుంది. బైట్‌డాన్స్ ప్రకారం.. సీడ్రీమ్ 4.0 మ్యాజిక్‌బెంచ్ – బెంచ్‌మార్క్‌లో గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్‌ను మించిన పర్‌ఫామెన్స్‌ని కనబరిచింది.
త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రస్తుతం, సీడ్రీమ్ 4.0 బైట్‌డాన్స్.. జిమెంగ్, డౌబావో AI యాప్‌లలో అలాగే వారి ఎంటర్‌ప్రైజ్-ఫోకస్డ్ ‘వోల్కానో ఇంజిన్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, దీని వేగవంతమైన పాపులారిటీ వల్ల ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది గూగుల్ నానో బనానా AIతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది.
ఈ కొత్త AI టూల్స్ డిజిటల్ కల్చర్‌ని మార్చడమే కాకుండా, క్రియేటివిటీని చేస్తున్నాయి. అయితే, వీటిని ఉపయోగించేటప్పుడు ప్రైవెసీ, డేటా సెక్యురిటీపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. AI ఇమేజ్ క్రియేషన్ టూల్స్ ఈ పోటీ భవిష్యత్తులో మరింత ఆవిష్కరణలకు దారితీస్తుందని ఆశించవచ్చు.
Also Read: విలువైన వస్తువులు పోగొట్టుకున్నారా?.. భయపడొద్దు జియో ట్రాకర్ కనిపెట్టేస్తుంది!