అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో కొత్త మిషన్ ను చేపట్టబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆర్టెమిస్ -2 మిషన్ ను చేపడుతుంది. ఇందులో భాగంగా ఓరియన్ స్పేష్ షటిల్ లో రీడ్ వైజ్ మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెస్ చంద్రుడి చుట్టూ రౌండ్ వేయున్నారు. వారితో పాటు కొన్ని పేర్లను కూడా తీసుకెళ్లనున్నారు. ఈ పేర్లలో మీవి కూడా ఉండవచ్చు అంటుంది నాసా. ఈ చారిత్రాత్మక మిషన్ లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ‘సెండ్ యువర్ నేమ్ విత్ ఆర్టెమిస్ II’ అనే క్యాపెయిన్ ను మొదలు పెట్టింది. వయస్సు, జాతీయతతో సంబంధం లేకుండా అందరూ తమ పేర్లను పంపుకునే అవకాశం కల్పిస్తోంది.
ఎవరైతే తమ పేరును ఈ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపాలి అనుకుంటారో వాళ్లు, నాసా అధికారిక పేజీకి వెళ్లాలి. ఆ సైట్ లో ఈ మిషన్ కు సంబంధించి రెండు లింకులు ఉంటాయి. అందులో ఒకటి ఇంగ్లీష్ లో, మరొకటి స్పానిష్ వెర్షన్ లో ఉంటుంది. ఈ లింక్ లో మీ పేరు సహా వివరాలను నమోదు చేసుకోగానే, ఈ చారిత్రాత్మక మిషన్ కు అందించిన సహకారానికి గుర్తుగా, వారి పేరుతో కూడిన డిజిటల్ బోర్డింగ్ పాస్ ను నానా అందిస్తుంది. ఆ పాస్ పొందిన వారి పేర్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లబడుతాయి.
ఇక ఈ మిషన్ ద్వారా తమ పేర్లను పంపుకోవాలనుకునే వారు జనవరి 21, 2026 వరకు నాసా వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. తమ పిల్లలు, స్నేహితులు, పెంపుడు జంతువుల పేరును కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది అంతరిక్ష చరిత్రలో భాగం కావడానికి ఒక ఆహ్లాదకరమైన, చిరస్మరణీయమైన మార్గంగా భావించవచ్చు. ఈ పేరు అన్నింటిని ఓ మెమరీ కార్డులో పొందుపరుస్తారు. దానిని ఈ మిషన్ ద్వారా దానిని అందరిక్షంలోకి పంపిస్తారు. ఈ పేర్లన్నీ ఆ మిషన్ ద్వారా జాబిలి చుట్టూ తిరిగి వస్తాయి. అందులో మీ పేరు కూడా ఉన్నందుకు సంతోషించవచ్చు.
ఆర్టెమిస్ II మిషన్ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో NASA ఆస్ట్రోనాట్స్ తో పంపే తొలి మిషన్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇది 50 సంవత్సరాలుగా ఏ మానవుడు ప్రయాణించని దూరానికి వ్యోమగాములను భూమి నుంచి అంతరిక్షానికి తీసుకెళ్లనుంది. 10 రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్షయాత్రకు సంబంధించిన ప్రయోగం ఏప్రిల్ 2026 లోపు ఫ్లోరిడాలోని NASA కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించబడుతుంది. ఇందులో కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పని తీరును ఆస్ట్రోనాట్స్ స్టడీ చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. ఇక ఈ మిషన్ సిబ్బందిలో రీడ్ వైజ్‌మాన్ (మిషన్ కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్), జెరెమీ హాన్సెన్ (కెనడియన్ స్పేస్ ఏజెన్సీ నుండి మిషన్ స్పెషలిస్ట్) వెళ్లనున్నారు.
Read Also: అక్కడ రైళ్లు ఆకాశాన్ని తాకుతాయి, అమ్మో ఆ స్టేషన్ అంత ఎత్తులో ఉందా?