E-Paper
Advertisement

Hyderabad News: పిల్లల భవిష్యత్‌తో ఆటలొద్దు.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆగ్రహం

Hyderabad News: పిల్లల భవిష్యత్‌తో ఆటలొద్దు.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆగ్రహం

Hyderabad News: స్వార్థ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్‌తో ఆటలు ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలోని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు. కసి, పట్టుదలతో తమ పిల్లలు ర్యాంకులు సాధించారని అన్నారు. ఇప్పుడు నోటికి వచ్చినట్టు నిందలు వేయడం సరికాదన్నారు. మాకు కచ్చితంగా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో జరిగిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల మెరిట్ లిస్టుపై వారం కిందట హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పేపర్ల రీవాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేకుంటే మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని తన తీర్పులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

దాదాపు 563 మంది ర్యాంకర్లు, మరో 100 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాంకర్లు పేరెంట్స్ మాట్లాడారు. మళ్లీ పరీక్షలు పెట్టాలని అంటున్నారని, ఫీజులు ఎవరు కడతారని ప్రశ్నించారు. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ పాసయ్యారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైతే ఆ తరహా ఆరోపణలు చేస్తున్నారో ఆధారాలను చూపాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని పలువురు పేరెంట్స్ కంటతడి పెట్టారు. మీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని, ఈ విషయంలో అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు. పిల్లలు ఎంతో కష్టపడి గ్రూప్‌-1 పరీక్షలో పాస్ అయ్యారని, ఈ విషయంలో హైకోర్టు తమకు న్యాయం చేయాలని కోరారు.

ALSO READ: అక్టోబర్ రెండున ఏం జరగబోతోంది? ఆ రోజు లిక్కర్, మీట్ షాపులు తెరిచే ఉంటాయా?

పోస్టులు కొనుగోలు చేశామని చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని అన్నారు. ఈ విషయంలో దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా నిజాలు తెలియపరచాలని కోరారు. ఈ క్రమంలో పేరెంట్స్ వారి ఉద్యోగాలు, కష్టపడిన తీరును వివరించారు. ర్యాంకర్లతో అక్కడికి వచ్చినవారిలో కొందరికి తండ్రి లేనివారు ఉన్నారు. మరికొందరికి తల్లి లేనివారు ఉన్నారు.

ఈ క్రమంలో వారు కష్టపడి పిల్లలను చదివించిన తీరును వివరించారు. తాము అన్ని కష్టాలు పడి పిల్లలను చదివిస్తే.. లేనిపోని విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అంటూ ఒకానొక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

ఈ వ్యవహారం జరుగుతుండగానే TGPSC కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. జాగృతి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తెలంగాణలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టు తలుపు తట్టారు. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులు పరీక్షను రద్దు చేయరాదంటూ మరికొన్ని పిటిషన్లను దాఖలు చేశారు. ఈ రెండింటిని కలిపి విచారించిన న్యాయస్థానం 222 పేజీలతో తీర్పు వెల్లడించింది.

 

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×