పండుగల సీజన్ మొదలైన వేళ ప్రయాణీకులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛత్ పూజ వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందిలేకుండా ప్రయాణీకులు జర్నీ చేసేలా అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే సెంట్రల్ రైల్వే 1,100కు పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వీటిని నపడపనున్నట్లు వెల్లడించింది.
వరుస పండుగల నేపథ్యంలో సెంట్రల్ రైల్వే ఇప్పటికే ప్రకటించిన 944 ప్రత్యేక రైళ్లకు మరో 82 అదనపు రైళ్లను జోడిస్తున్నట్లు తెలిపింది. “2025 దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగ కోసం సెంట్రల్ రైల్వే 1126 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇప్పటికే ప్రకటించిన 944 ప్రత్యేక రైళ్లతో పాటు 182 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌలభ్యం కోసం అదనపు రైళ్లను నడుపుతోంది”అని సెంట్రల్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. దసరా, దీపావళి, ఛత్ పూజ కోసం ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో ఎక్కువ భాగం ముంబై- పూణే నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. ముఖ్యంగా ముంబై-దానపూర్, ముంబై-బనారస్, ముంబై-మౌ, ముంబై-కరీంనగర్, పూణే-అమరావతి, పూణే-సంగనేర్ మధ్య ఈ రైలు సర్వీసులు నడవనున్నాయి.
01017 బై-వీక్లీ స్పెషల్ ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతి సోమవారం, శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 22.45 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. మొత్తం 20 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 01018 బై-వీక్లీ స్పెషల్ ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రతి సోమవారం, బుధవారం ఉదయం 12.30 గంటలకు దానాపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ చేరుకుంటుంది. మొత్తం 20 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
01123 బై వీక్లీ ప్రత్యేక రైలు ఈనెల 26 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరి మూడవ రోజు ఉదయం 05.35 గంటలకు మావు చేరుకుంటుంది. మొత్తం 20 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అటు 01124 బై వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి ఆదివారం, మంగళవారం ఉదయం 07.35 గంటలకు మావులో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 22.20 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్‌కు చేరుకుంటుంది. మొత్తం 20 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
01051 బై వీక్లీ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం, గురువారం ఈ నెల 24 నుంచి నవంబర్ 27 వరకు మధ్యాహ్నం 12.15 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరి మూడవ రోజు మధ్యాహ్నం 1.10 గంటలకు బనారస్ చేరుకుంటుంది. మొత్తం 20 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 01052 బై వీక్లీ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం, శనివారం ఈ నెల 26 నుంచి నవంబర్ 29 వరకు ఉదయం 6.35 గంటలకు బనారస్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్‌కు చేరుకుంటుంది. మొత్తం 20 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
01067 వీక్లీ స్పెషల్ ఈ నెల 23 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 01068 వీక్లీ స్పెషల్ ఈ నెల 24 నుంచి అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్ నుంచిబయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 13.40 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్ చేరుకుంటుంది. మొత్తం 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
01403 వీక్లీ స్పెషల్ అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.55 గంటలకు పూణే నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.05 గంటలకు అమరావతి చేరుకుంటుంది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 01404 వీక్లీ స్పెషల్ రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం అర్థరాత్రి 12.15 గంటలకు పూణే చేరుకుంటుంది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అటు పూణే – సంగనేర్ జంక్షన్ – పూణే వీక్లీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ 14 సర్వీసులు, పుణే – సంగనేర్ జంక్షన్ – పూణే బై-వీక్లీ స్పెషల్ 26 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీపావళి, ఛత్ పూజ కోసం నడిపూ ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించి బుకింగ్ విండో సెప్టెంబర్ 14న ప్రారంభమైంది. ప్రయాణీకులుIRCTC వెబ్‌సైట్‌లో తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Read Also: రైల్వే కొత్త రూల్.. ఇకపై మొదటి 15 నిమిషాలు వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి!