Tirumala: తిరుమలలో మరోసారి ఘోర అపచారం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి దేవాలయంకి.. కాలి నడకన వెళ్లే అలిపిరి మార్గం వద్ద జరిగిన నిర్లక్ష్యం.. భక్తుల్లో ఆగ్రహం రేపుతోంది. ఆ మార్గంలో ఏర్పాటు చేసిన శ్రీ మహావిష్ణువు విగ్రహం పక్కన మలమూత్రాలు, మద్యం బాటిళ్లు, చెత్త కనిపించడం భక్తుల మనసును కలచివేసింది. పవిత్రతకు ప్రతీకగా ఉండే ఈ మార్గంలో ఇలాంటి దృశ్యాలు దర్శనమివ్వడం నిజంగా ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆరోపిస్తున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు
ఈ ఘటనపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే విగ్రహాన్ని.. ఇలాంటి చెత్త ప్రదేశంలో పడేయడం ఘోరమైన అపచారం. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? టీటీడీ ఎలా ఇంత నిర్లక్ష్యంగా ఉండగలిగింది? అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ పాలక మండలి పరిపాలన ఏ స్థాయికి దిగజారిందో చెప్పేందుకు.. టీటీడీ స్థలంలో బీరు బాటిళ్ల మధ్య పడి ఉన్న.. మహా విష్ణువు విగ్రహమే నిలువెత్తు నిదర్శనం అని భూమన అన్నారు. ప్రపంచంలో హిందువులు అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే మహావిష్ణువు విగ్రహాన్ని ఏ దిక్కూ లేకుండా పడేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి వారికి ఇంతకంటే అపచారం, దైవ ద్రోహం, నేరం మరొకటి లేదన్నారు.
టీటీడీ స్థలంలోనే మహా విష్ణు భగవానుడికి ఇంత నిర్లక్ష్యమా ? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి హిందూ ధర్మంపై దాడి అన్నారాయన. విగ్రహం ఇలా పడి ఉంటే.. విజిలెన్స్ చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నారా? అధికారులు ఏమి చేస్తున్నారని భూమన ధ్వజమెత్తారు.
అలాగే, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు సహించబోమని హెచ్చరించారు.
భక్తుల్లో ఆవేదన
విగ్రహం చెత్త మధ్యలో కనిపించడంపై.. భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు భక్తి భావంతో పాదయాత్ర చేస్తారు. అలాంటి పవిత్ర మార్గంలో ఇలాంటి దృశ్యం కనిపించడం హృదయాన్ని కలచివేస్తుందని వారు అంటున్నారు.
Also Read: అల్లరి చేస్తోందని విద్యార్థిని పుర్రె పగలకొట్టిన టీచర్..
కఠిన చర్యలు
తిరుమలలో జరిగిన ఈ ఘటన భక్తుల మనసులో.. తీవ్ర ఆవేదన కలిగించింది. పవిత్రమైన శ్రీవారి మార్గంలో మహావిష్ణువు విగ్రహం చెత్త మధ్యలో పడేయబడటం ఘోర అపచారమే. దీనిపై ప్రభుత్వం, టీటీడీ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం, తిరుమల పవిత్రతను నిలబెట్టుకోవడం అందరి బాధ్యత.