Skoda Kylaq SUV : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా నుంచి కైలాక్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది. ఈ కారు ఇంకా మార్కెట్లోకి రాక ముందే ఫుల్ డిమాండ్ పెరిగింది. కేవలం 10 రోజులకే 10వేల బుకింగ్‌లకు చేరుకుంది. దీంతో ఈ కారు సరికొత్త రికార్డును నెలకొల్పింది.
స్కోడా తీసుకొచ్చిన ఈ కారు ధర రూ. 8 లక్షల నుంచి రూ. 14.40 లక్షల మధ్య ఉంటుందని ఆటో మొబైల్ నెట్వర్లో అంచనా వేస్తున్నారు అయితే ఈ కంపెనీ లైన్ అప్ లో వచ్చిన అతి చిన్న మోడల్ ఇదే కావటం చెప్పుకోదగిన విషయం ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా పది రోజులకే 10,000 బుకింగ్స్ ను చేరుకొని కొత్త రికార్డును నెలకొల్పగా ఈ బుకింగ్ ఆన్లైన్ డేటా ఆధారంగా అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది
అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కారు డెలివరీలు వచ్చే ఏడాది జనవరి 27, 2025 వరకు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. అప్పటివరకు కస్టమర్స్ సైతం స్కోడా కైలాక్ టెస్ట్ డ్రైవ్ ను చేసే అవకాశం లేదు. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా ఈ విషయంపై స్పందిస్తూ… “షో రూమ్ లో కార్ లేకుండానే పది రోజుల్లోనే 10,000 బుకింగ్ అయ్యాయి. ఇది నిజంగా సరికొత్త రికార్డు. తమ కంపెనీ కార్లు ఈ రేంజ్ లో ఫ్రీ బుకింగ్స్ కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.”
స్కోడా కంపెనీ తీసుకొస్తున్న కైలాక్ పూర్తిగా కొత్త కారనే చెప్పవచ్చు. ఇక కొత్త సబ్-4ఎమ్ ఎస్‌యూవీ విభాగంలో.. ఈ 10000 బుకింగ్స్ కస్టమర్‌లు కైలాక్‌ను పొందే అవకాశం లేకుండానే వచ్చాయి. దీంతో స్కోడా కంపెనీ బ్రాండ్‌పై సాటిలేని నమ్మకాన్ని అందిస్తుందనే చెప్పవచ్చు. కైలాక్ కారు ఇండియా రహదారులపై యూరోపియన్ టెక్నాలజీని విస్తరించేలా చేస్తుందని విశ్వసిస్తున్నామని స్కోడా కంపెనీ తెలిపింది. ఇక అధికారిక లాంచ్‌కు ముందే స్కోడా ఆటో ఇండియా ‘డ్రీమ్ టూర్’ని సైతం ప్రారంభించింది.
ఇక అధికారికంగా అందుబాటులోకి రావటానికి ఇంకా 43 రోజులు ఉండగానే.. 3 స్కోడా కైలాక్ ఎస్‌యూవీలు దేశవ్యాప్తంగా 70 నగరాల్లో ప్రదర్శన ఇవ్వనున్నాయి. పెద్ద మొత్తంలో కస్టమర్‌లు కారును వ్యక్తిగతంగా చూసేందుకు అవకాశాన్ని ఇస్తారని తెలుస్తుంది. ఇక ఈ డ్రీమ్ టూర్ కార్ మరింత మంది స్కోడా అభిమానులకు చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఫీచర్స్ తో పాటు ఆధునిక డిజైన్స్ తో అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ని అందించనున్నట్టు కూడా స్కోడా ప్రియులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ స్కోడా కైలాక్ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రాబోతుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో అందుబాటులోకి వస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఈఎస్‌సీ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇక ఈ కారు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ధర వివరాలు వెలువడే అవకాశం ఉంది.