BigTV English

Raghunandan Rao: కేటీఆర్ వాకింగ్‌కు రెడీనా.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

Raghunandan Rao: కేటీఆర్ వాకింగ్‌కు రెడీనా.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

Raghunandan Rao: కేటీఆర్.. వాకింగ్ కి రెడీగా ఉండండి. ఆ సమయం వచ్చేసినట్లే ఉంది. నాడు మీరే చెప్పారు. జైలుకు వెళితే వాకింగ్ చేస్తానంటూ.. మీరు చెప్పారు కదా. అందుకు సిద్దంకండి అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి, రఘునందన్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.


రఘునందన్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన ఏసీబీ కేసు క్వాష్ చేయమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ మీద సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇస్తూ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయమలేమని ఇన్వెస్ట్రేషన్ కు సహకరించాలని ఆదేశించినట్లుగా ఎంపీ అన్నారు. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు గగ్గోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసు రిజిస్టర్ అయ్యే ముందు కేటీఆర్.. అదేం కేసు లొట్ట పీస్ కేసన్నారని, ఐదు నిమిషాల్లో వెళ్లి వస్తానంటూ ప్రకటించారన్నారు. మరి లొట్ట పీస్ కేసుకు పోలీసుల ముందుకు వెళ్లేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఎంపీ.

మొదట్లో దాంట్లో అవినీతి జరగలేదని చెప్పిన కేటీఆర్, తర్వాత పైసలు మంత్రి హోదాలో బారా బారా ఇచ్చినా అంటూ మీడియా ముందే చెప్పారన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. అదే విషయాన్ని ఏసీబీ ముందు చెప్పాలి కానీ, న్యాయవాదులను తీసుకుని కేటీఆర్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారంటూ రఘునందన్ విమర్శించారు. పది సంవత్సరాలు మంత్రిగా చేసినా కేటీఆర్ తెలంగాణ పోలీసులు గొప్పవాళ్లు, దేశంలోనే నెంబర్ వన్ పోలీసులు భద్రత బాధ్యత మాదని గతంలో చెప్పారని ఎంపీ గుర్తు చేశారు. రూ. 1200 కోట్లు కట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా, మా తెలంగాణ పోలీసులు గొప్పగా పనిచేస్తారని కేటీఆర్ చెప్పారన్నారు. పదేళ్లు గొప్పగా అని చెప్పిన పోలీసుల ముందుకి ఈరోజు కేటీఆర్ వెళ్లేందుకు ఎందుకు జంకుతున్నారో అర్థం కావడం లేదన్నారు.


పదేళ్లు పోలీసులు మంచిగా అయిన వాళ్ళు, ఈ రోజు చెడ్డగా ఎందుకు అయ్యారంటూ కేటీఆర్ ను ఎంపీ ప్రశ్నించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పోలీసులచే తప్పు చేయించారని, దుబ్బాకలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో ఒక రైతు చనిపోయినప్పుడు చూసి రావడానికి వెళ్తే తనను రోడ్డుమీద ఆపి పోలీస్ స్టేషన్లో పెట్టారని ఎంపీ గుర్తు చేశారు. ఆరోజు పోలీసులు మంచి వాళ్ళు ఎట్లా అయ్యారు. ఈరోజు పోలీసు స్టేషన్ కే రమ్మంటే వెనుక మంది 10 మంది లాయర్ లు కావాలని అడుగుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.

ఏం తప్పు చేయకపోతే కడిగిన ముత్యం అయితే కేసుకు ఎందుకు భయపడుతున్నారన్న ఎంపీ, హైకోర్టు కూడా మీ వాదనను కొట్టేసింది. ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అంటూ ఎంపీ సూచించారు. జైలుకు పోతే ఏమవుతుందన్నారు. వాకింగ్ చేస్తా, యోగ చేస్తా అన్నారు ఇప్పుడు రెడీగా ఉన్నారా అంటూ ఎంపీ అన్నారు. జైలు పోతే ప్రశాంతంగా ఉంటానని, తర్వాత పాదయాత్ర చేస్తా అంటూ కేటీఆర్ గతంలో చెప్పినట్లు రఘునందన్ గుర్తు చేశారు. తప్పు చేయలేదు అవినీతి జరగలేదంటారు. మోడీకి, ఈడీకి, దేనికి భయపడనని చెప్పి, ఈరోజు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.

Also Read: Formula E Race: ఫార్ములా ఈ కారు కేసు.. ప్రభుత్వం దూకుడు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు

చలి జ్వరం వచ్చినట్టు ఎందుకు భయపడుతున్నారు. అవసరం అనుకుంటే మనోహరాబాద్ నుంచి ఇద్దరు డాక్టర్లను పంపుతా. పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రతిపక్షాలను అరెస్ట్ చేసి జైలులో వేయించారన్నారు. దొంగల వెంబడి వకీలు రారని, కేటీఆర్ తప్పు చేయకపోతే ఏసీబీ, ఈడీ ముందుకు వెళ్లాలన్నారు. కేటీఆర్ ఆన్యాయం జరిగితే కేసు పెట్టండి.. నిజనిర్ధారణ జరుగుతది, చట్టం ముందు అందరూ సమానులే.. పోలీసులకు సహకరించి చట్టానికి సహకరించాలని ఎంపీ కోరారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు మమ్మల్ని, అందరినీ అరెస్టు చేశావు. నా మీద చాలా కేసులు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అంటూ ఎంపీ దుయ్యబట్టారు. కేటీఆర్ తప్పు చేశారని ప్రభుత్వము, పోలీసులు, ప్రజలు నమ్ముతున్నారని, పోలీసుల మీద కోర్టుల మీద కేటీఆర్ అపనమ్మకాన్ని ప్రచారం చేయొద్దని ఎంపీ రఘునందన్ విన్నవించారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×