BigTV English
Advertisement

White Hair: తెల్లజుట్టును10 నిమిషాల్లో నల్లగా మర్చే.. బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే..

White Hair: తెల్లజుట్టును10 నిమిషాల్లో నల్లగా మర్చే.. బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే..

White Hair: పూర్వం రోజుల్లో 60 ఏళ్లు దాటిన తర్వాత తెల్ల వెంట్రుకలు రావడం మొదలయ్యేవి.. కానీ ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, పొల్యూషన్, ఆలోచన సరళిలో మార్పులు వల్ల, ఎండ తగలనందు వల్ల వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. దీంతో చాలామంది బయట తిరగాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఇందుకోసం రకరకాల హెన్నాలు, హెయిర్ కలర్స్, హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయి గానీ.. శాశ్వతంగా పనిచేయవు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే సహజ పదార్ధాలతో ఈ చిట్కాలు పాటించారంటే.. తెల్లజుట్టు మాయం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్ధాలు..
బ్లాక్ సీడ్స్
టీ స్పూన్ కాఫీ
కప్పు వాటర్
అలోవెరా జెల్

తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఐదు టేబుల్ స్పూన్ బ్లాక్ సీడ్స్, కాఫీ పొడి వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత వేరే బౌల్‌‌లో వడకట్టి.. అందులో మూడు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. ఈ హెయిర్ మాస్క్ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్దాలన్ని జుట్టుకు పోషణనను అందిస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.


ఉసిరి, కరివేపాకు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్..
ముందుగా ఉసిరి ముక్కలు, కరివేపాకు మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్‌లో ఈ మిశ్రమాన్ని కాటన్ క్లాత్‌లో వేసి రసాన్ని తీయండి. అందులో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి మిక్స్ చేసి.. జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు నివారించడంతో పాటు.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు చక్కగా పనిచేస్తుంది. కరివేపాకు, ఉసిరిలో జుట్టుకు పోషణను అందించే గుణాలు పుష్కలంగా లభిస్తాయి.

Also Read: ఒక్కసారి ఈ హెన్నా అప్లై చేశారంటే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు కాస్త నల్లగా మారుతుంది

కలోంజి సీడ్స్, పెరుగు హెయిర్ మాస్క్
తెల్లజుట్టు నివారించేందుకు, జుట్టు ఒత్తుగా, పొడవుగా, చుండ్రును తొలగించేందుకు ఈ హెయిర్ మాస్క్ అద్బుతంగా పనిచేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికి కావాల్సిన పదార్గాలు..
కలోంజి విత్తనాలు
పెరుగు
బాదం నూనె
అలోవెరా జెల్

తయారు చేసుకునే విధానం..
ముందుగా కలోంజి విత్తనాలను మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పొడిచేసుకోండి. ఈ మిశ్రమాన్ని చిన్న బౌల్‌లో తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ బాదం నూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని తలకు పట్టించి గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. నెలకు రెండు, మూడు సార్లు చేస్తే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×