Xiaomi 15 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గ్జియోమీ త్వరలోనే Xiaomi 15 మెుబైల్ ను తీసుకురాబోతుంది. ఇటీవల Geekbench v4లో వచ్చేసిన హై ప్రోసెసర్ తో ఈ మెుబైల్ రాబోతుంది. ఇక ఇప్పటివరకూ పూర్తి స్థాయి ఫీచర్స్ తెలియనప్పటికీ తాజాగా ప్రోసెసర్ వివరాలు మాత్రం లీక్ అయ్యాయి.
Xiaomi 15 – ఈ స్మార్ట్‌ఫోన్ 3.53GHz బేస్ క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ SoC ద్వారా పనిచేయనుంది. అంతే కాకుండా, హ్యాండ్‌సెట్‌లో అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. ఇక ఇందులో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌ని తీసుకువస్తుందని తెలుస్తుంది.
Xiaomi 15 12GB RAMతో పాటు Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో రామ్ వేరియంట్స్ సైతం ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంటుందని, 12GB RAM + 256GB అంతర్గత స్టోరేజ్, 12GB RAM + 512GB అంతర్గత స్టోరేజ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో పాటు హైపర్ OS 2.0 ఉండే అవకాశం ఉంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ BIS సర్టిఫికేషన్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)లో కూడా కనిపించింది. దీంతో భారత్ లో త్వరలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ALSO READ : స్కోడా కొత్త కారు సరికొత్త రికార్డు.. 10 రోజుల్లో 10వేల బుకింగ్స్