E-Paper
Advertisement

Hyderabad Cold Wave: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hyderabad Cold Wave: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Advertisement

Hyderabad Cold Wave: రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున వేళల్లో శివారు ప్రాంతాలు తీవ్రమైన చలితో గజగజ వణుకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం.

హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. పఠాన్ చెరువు ప్రాంతంలో అత్యల్పంగా 7.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. అదే విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో 8.3 డిగ్రీలు, రాజేంద్ర నగర్‌లో 9 డిగ్రీలు, మల్కాజిగిరిలో 9.1 డిగ్రీలు నమోదయ్యాయి.

Advertisement

అల్వాల్‌లో 10.3 డిగ్రీలు, చందానగర్‌లో 10.4 డిగ్రీలు, కుద్భుల్లాపూర్‌లో 10.7 డిగ్రీలు, గాజులరామారంలో 10.8 డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగర కేంద్ర ప్రాంతాలతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

చలి తీవ్రతతో ప్రజలు రాత్రివేళ బయటకు రావాలంటే భయపడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

పల్లె ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల ప్రజలు చలిని తట్టుకోవడానికి రాత్రి వేళల్లో మంటలు వేసుకుని చుట్టూ కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. టీజీడీఎస్ (తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) ప్రకారం సోమవారం నుంచి చలి తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.

ఇక సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ చలి ఏర్పడినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఉదయం, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: తెలంగాణలో క్లీనింగ్ మొదలు.. రాజకీయ పార్టీల్లో టెన్షన్, ఎవరికి డ్యామేజ్?

వృద్ధులు, చిన్నపిల్లలు అవసరం లేని వేళ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×