BigTV English

Food Safety Department: హోటల్ నిర్వాహకులారా తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే తాట తీస్తారు: ఫుడ్‌ సెఫ్టీ అధికారుల డెడ్లీ వార్నింగ్

Food Safety Department: హోటల్ నిర్వాహకులారా తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే తాట తీస్తారు: ఫుడ్‌ సెఫ్టీ అధికారుల డెడ్లీ వార్నింగ్

Food Safety Department Deadly Warning to Hyderabad Restaurants: హోటల్ నిర్వాహకులారా.. తస్మాత్ జాగ్రత్త.. అడ్డదిడ్డమైన ఐటమ్స్‌.. అస్సలు అపరిశుభ్రంగా లేని కిచెన్స్‌లో వండి.. కస్టమర్స్‌ మొఖాన కొట్టి.. డబ్బులు గల్లా పెట్టేలో వేసుకుంటామంటే కుదరదు ఇక. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని మసలండి. ఎప్పుడు ఎటువైపు నుంచి అధికారులు ఎంట్రీ ఇస్తారో తెలీదు. కేసులు నమోదు చేస్తారో అంతకన్నా తెలీదు. హైదరాబాద్‌ రెస్టారెంట్స్‌ ఓనర్స్‌కు మాత్రమే కాదు ఈ వార్నింగ్..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్స్‌కు ఫుడ్‌ సెఫ్టీ అధికారులు ఇస్తున్న డెడ్లీ వార్నింగ్ ఇది.


ఇప్పటికే భాగ్యనగరం షేక్ అయ్యింది ఫుడ్ సెఫ్టీ అధికారుల సోదాలతో.. అస్సలు స్టార్‌లు లేని కాకా హోటల్‌, రెస్టారెంట్స్నుంచి మొదలుపెడితే..ఫైవ్ స్టార్‌ హోటల్స్ వరకు దేన్ని వదలకుండా రెయిడ్స్ చేస్తున్నారు. యాజమాన్యాల గుట్టు రట్టు చేస్తున్నారు. ఇప్పుడు వారి నజర్‌ను జిల్లాలవైపు ఫోకస్ చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో సోదాలు షురూ చేశారు.

కంపు కొడుతున్న కిచెన్స్‌ ఉన్నాయా.. ఇక కడిగేయండి. కుళ్లిపోయిన మీట్ ఉందా.. దానిని పడేయండి. ఎక్స్‌పైరీ దాటిన ప్రొడక్ట్స్‌.. కల్తీ మసాలాలు.. ప్రమాదకరమైన కలర్స్.. అన్నీ తీసి చెత్తబుట్టలో వేయండి. హోటల్స్‌ అండ్ రెస్టారెంట్స్‌ను ఇప్పటికైనా క్లీన్ చేయండి. ఇన్నాళ్లు తెలిసో.. తెలియకో.. ఏ చేతితో అయితే రోగాల బారిన పడేలా ఫుడ్‌ను తినిపించారో.. ఇప్పుడదే చేతితో శుచి, శుభ్రతతో కూడిన మంచి పదార్థాలతో వంట చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏ వైపు నుంచి అధికారులు వస్తారో అస్సలు తెలీదు మరీ.


Also Read: నయీం డైరీలో ఏముంది? తెలంగాణ సర్కార్ ఫోకస్..

మీరు మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒక మాట వినే ఉంటారు. ఇలా పుచ్చిపోయిన.. కుళ్లిపోయిన కూరగాయలను ఎవరు కొంటారని ప్రశ్నిస్తే.. ఎవరో హోటల్‌ వాళ్లు వచ్చి కొంటారు.. ఏదీ వెస్ట్‌ కాదని చెబుతుంటారు వ్యాపారులు. సో దీన్ని బట్టే అర్థమవుతోంది మనం తినే వంట పదార్థాలు ఎంత శుచి, శుభ్రతతో ఉంటాయో.. అంటే ఇదే నిజమని కాదు.. బట్ దాదాపుగా నిజం ఇది. నాట్ ఓన్లీ కూరగాయలు.. నాన్‌ వెజ్ దగ్గరా అంతే..

మసాలాలు.. అల్లం, వెల్లుల్లి.. ఆఖరికి నూనెతో సహా.. వంటలో వాడే అన్ని ingridients దో నెంబర్ మాల్‌ అనే ప్రచారం ఉంది. సో.. ఇకపై ఇలాకొనుగోలు చేసే వ్యాపారులు.. కాస్త ఒకటికి పది సార్లు ఆలోచించండి. ఇకపై ఇలాంటి పనులు చేయడం మానండి.. అలా కాదని చేస్తే మాత్రం ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరగడం పక్కా.. అందుకే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేయడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఒకటి, రెండు జిల్లాల్లోనే మొదలైనా.. రాష్ట్రవ్యాప్తంగా అతి త్వరలో సోదాలు జరగడం పక్కా.

Also Read: Rachakonda CP: గుట్టుగా చిన్నారుల అమ్మకం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..

ఇప్పటికే కరీంనగర్, ఖమ్మంలోని పలు రెస్టారెంట్స్‌పై దండయాత్ర మొదలైంది. అపోలో పిష్, రొయ్యలు, పాలక్, వండిన మటన్, చికెన్.. ఇలా అన్ని పాడైనవే దొరికాయి. మటన్, చికెన్ లాంటి వాటిని సగం ఉడకబెట్టి అర్డర్ వచ్చినప్పుడు వాటిని వండి వడ్డిస్తున్నట్టు గుర్తించారు. మిగిలిపొయిన అహారాన్ని తిరిగి ఫ్రై చేసి వడ్డీస్తున్నారని కూడా తేల్చేశారు. వారితోటే ఆ వంటకాలను డస్ట్ బీన్ లో పడేలా చేశారు.

సో.. మళ్లీ చెబుతున్నాం.. ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. హోటల్‌ యాంబియెన్స్‌పై ఉన్న శ్రద్ధ.. కాస్త కిచెన్‌పై కూడా పెట్టండి. ప్రస్తుతం తనిఖీల్లో చాలా చోట్ల రీయూజ్‌డ్‌ ఆయిల్ వాడుతున్నట్టు గుర్తించారు. చాలా కిచెన్స్ జిడ్డు కారుతున్నాయి.. ప్రశ్నించే వారు లేరని.. ఇష్టం వచ్చినట్టు వ్యవహారిస్తున్నారు. సో ఇలాంటి హోటల్స్‌లో తింటే.. జేబుకు చిల్లు పడటంతో పాటు.. ఆరోగ్యానికి కూడా తూట్లు పడతాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×