BigTV English

iQOO Neo 9S Pro Plus: మాటల్లేవ్.. ఐక్యూ న్యూ స్మార్ట్‌ఫోన్.. ఈసారి కొత్తగా వచ్చేస్తోంది!

iQOO Neo 9S Pro Plus: మాటల్లేవ్.. ఐక్యూ న్యూ స్మార్ట్‌ఫోన్.. ఈసారి కొత్తగా వచ్చేస్తోంది!

iQOO Neo 9S Pro Plus: జులైలో అనేక మొబైల్ కంపెనీలు కొత్తకొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నాయి. ఈ పోటీలో నిలిచేందుకు ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ కూడా సిద్ధమైంది. iQOO Neo 9S Pro Plus స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇది కాకుండా iQOO వాచ్ GT స్మార్ట్‌వాచ్, iQOO TWS 1i ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా తీసుకొస్తుంది. అయితే ఈ గ్యాడ్జెట్లన్నీ చైనా‌లో ముందుగా అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇండియాలోకి వస్తాయి. ఈ కొత్త ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


iQOO Neo 9S Pro Plus Specifications
ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 4nm ప్రాసెస్‌లో తయారు చేశారు. Adreno 750 GPUతో పాట, ఇది మెరుగైన పర్ఫామెన్స్, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 5500mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, 120W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది.

Also Read: ఈ రింగ్ ఉంటే మీరే కింగ్.. మీ హెల్త్ డేటాను ట్రాక్ చేస్తుంది!


దీనికి 1-144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌ను 16GB RAM+ 1TB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్‌లలో రానుంది.ఈ కొత్త ఐక్యూ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP హై-క్వాలిటీ కెమెరాను పొందుతుంది.

ఇది 5500mAh కెపాసిటీ డ్యూయల్ సెల్ బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 120W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OriginOS 4.0 పై రన్ అవుతుంది. ఇది స్మూత్, కస్టమైజ్‌డ్ వినియోగదారులకు మెటర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది.

Also Read: కొత్త కలర్.. వన్‌ప్లస్ అదిరింది.. కెమెరా, ఫీచర్లు సూపర్!

ఇందులో IP65 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంది. ఇతర కనెక్టివిటీ ఫీచర్లలో 5G SA/NSA, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC ఉన్నాయి. ఐక్యూ 9 ఎప్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కంపెనీ వినియోగదారులకు iQOO వాచ్ GT స్మార్ట్‌వాచ్, iQOO TWS 1i ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ అయ్యాయి. iQOO వాచ్ GT డిజైన్ మే లో ప్రారంభించిన vivo వాచ్ GT లాగా కనిపిస్తుంది.

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×