This Is The Difference Between Night Day NASA Has Released Terminator Photos: అంతరిక్షంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు నాసా చేసే సేవలు విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు ఇప్పటికే చాలా సక్సెస్ కాగా, మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక అంతరిక్షంలో జరిగే అధ్బుతాలను ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తూ వారథిగా నిలుస్తోంది. ఇక అంతరిక్షంలో వెలుగు మొదలైతే పగలు వెలుగు వెళ్లిపోతే రాత్రి ఈ రెండింటికి మధ్య ఉండేదే సంధ్యా సమయమని అందరికి తెలిసిందే. మనకు ఇదే స్పష్టంగా అర్థమవడానికి చాలా సమయం పడుతుంది.
కానీ ఆకాశం నుంచి చూస్తే మాత్రం వెలుగు, చీకట్ల మధ్య ఒక విభజన రేఖ గీసినట్టుగా మనకు క్లారిటీగా కాంతివలే కనిపిస్తుంది. భూమి తిరుగుతున్న కొద్దీ అది నిరంతరం కదులుతూనే కనిపిస్తుంది. ఇలా రాత్రి, పగలును విభజించే రేఖను సాంకేతికంగా టెర్మినేటర్ అని పిలుస్తుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రికరీంచిన ఈ దృశ్యాలు భూమి మీద దాదాపు అన్ని ప్రాంతాల్లో రోజూ రెండుసార్లు ఈ ప్రక్రియ జరుగుతుంది. టెర్మినేటర్ రేఖ వాటిపై నుంచి నిదానంగా ముందుకు కదులుతోంది. భూమికి 4వందల కిలోమీటర్ల ఎత్తున తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ టెర్మినేటర్ రేఖను నాసా రికార్డు చేసింది.
తాజాగా తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఆ ఫొటోలను పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అంతరిక్షానికి భూమికి మధ్య కాంతులతో ఈ ఫొటోలలో అన్నింటికన్నా పైన నల్లని అంతరిక్షం దాని దిగువన నీలి రంగులో భూమి వాతావరణం ఎలా ఉందో దాని కింద భూమిపై పడి తెలుపు రంగులో ప్రతిఫలిస్తున్న కాంతిని మనం పరిశీలించవచ్చు. ఆ దిగువన బంగారు రంగులోని సంధ్యా సమయ వెలుతురు లాంటిది మనకు ఇందులో కనిపిస్తుంది. అన్నింటికన్నా కింద ఇంకా రాత్రి చీకట్లలో ఉండి నలుపు రంగులో కనిపిస్తున్న భూమి మనకు ఇందులో స్పష్టంగా కనిపిస్తుంటాయి.