E-Paper
Advertisement

రూ.5799కే 24 ఇంచుల టీవీ..చిన్న రూమ్స్, షాపులకు ఇది పర్ఫెక్ట్!

రూ.5799కే 24 ఇంచుల టీవీ..చిన్న రూమ్స్, షాపులకు ఇది పర్ఫెక్ట్!
Advertisement

Thomson 24 inch LED TV: ప్రస్తుత రోజుల్లో.. ఎంటర్టైన్మెంట్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. లివింగ్ రూమ్‌ల కోసం పెద్ద టీవీలు ఎలాగూ వాడతాము, కానీ బెడ్ రూమ్, స్టడీ రూమ్,లేదా చిన్న షాపుల కోసం తక్కువ బడ్జెట్‌లో ఒక చిన్న టీవీ కావాలంటే చాలా మంది ఆలోచిస్తారు. అలాంటి వారి కోసమే థామ్సన్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన మోడలే  ఇది. రూ.6000 లోపు బడ్జెట్‌లో లభిస్తున్న ఈ టీవీ గురించి ఇప్పుడు ట్రెండింగ్ విషయాలు తెలుసుకుందాం.

ట్రెండీ డిజైన్, బెజెల్ లెస్ లుక్ :

ఈ టీవీ చూడటానికి చాలా మోడర్న్‌గా, కాంపాక్ట్‌గా ఉంటుంది. దీనికి ఇచ్చిన స్లిమ్ బెజెల్ డిజైన్ వల్ల టీవీ స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. చిన్న గదుల్లో.. గోడకు మౌంట్ చేసినా లేదా టేబుల్ పై స్టాండ్ వేసి ఉంచినా ఇది కిచెన్ లేదా రూమ్‌కి ఒక ప్రీమియం లుక్‌ని తెస్తుంది. 24 ఇంచుల సైజు ఉండటం వల్ల ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. చూడటానికి కూడా ఇది క్లాసీ లుక్ అందిస్తుంది.

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, కలర్స్:

Advertisement

చిన్న టీవీ అయినప్పటికీ పిక్చర్ క్వాలిటీ విషయంలో.. థామ్సన్ ఎక్కడా రాజీ పడలేదు. ఇది హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో ఉన్న ‘Vivid Color’ టెక్నాలజీ వల్ల పిక్చర్స్ చాలా సహజంగా, క్వాలిటీతో కనిపిస్తాయి. సినిమా చూస్తున్నప్పుడు లేదా సీరియల్స్ చూస్తున్నప్పుడు.. విజువల్స్ చాలా స్పష్టంగా ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే ‘Wide View Angle’ సపోర్ట్ వల్ల రూమ్‌లో ఎక్కడి నుంచి చూసినా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. కలర్స్ ఫేడ్ అవ్వడం లాంటి సమస్యలు రావు.

పవర్ ఫుల్ సౌండ్ అవుట్‌పుట్:

సాధారణంగా 24 ఇంచుల చిన్న టీవీలలో సౌండ్ కొంచెం తక్కువగా.. ఉంటుందనే అపోహ ఉంటుంది. కానీ ఈ థామ్సన్ టీవీలో ఏకంగా 20W సౌండ్ అవుట్‌ పుట్‌ను అందించే పవర్ ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. ఎక్స్‌ట్రా హోమ్ థియేటర్ లేదా స్పీకర్లు పెట్టాల్సిన అవసరం లేకుండానే.. రూమ్ అంతటా మంచి సౌండ్ లభిస్తుంది. పాటలు వినేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ఆడియో క్లారిటీ చాలా బాగుంటుంది.

స్పోర్ట్స్ మోడ్ , ఇతర ఫీచర్లు:

Advertisement

మీకు క్రికెట్, ఫుట్‌బాల్ లేదా ఇతర ఆటలు చూడటం ఇష్టమా? అయితే.. ఇందులో ప్రత్యేకంగా ఇచ్చిన స్పోర్ట్స్ మోడ్ మీకు బాగా నచ్చుతుంది. మైదానంలో.. జరిగే ఆటను మరింత ఉత్సాహంగా, ఎలాంటి బ్లర్ లేకుండా స్పష్టంగా చూసేలా ఈ మోడ్ సహాయ పడుతుంది. వివిధ రకాల డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి అవసరమైన HDMI, USB పోర్ట్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: వంటింటి కోసం బెస్ట్ ఫ్రిజ్ ఏది? ఎల్జీ, శాంసంగ్ మోడల్స్ మధ్య తేడాలు!

ఎందుకు కొనాలి?

మీరు తక్కువ బడ్జెట్‌లో (కేవలం రూ.5799 కే) ఒక నమ్మకమైన, మంచి విజువల్స్ , సౌండ్ ఇచ్చే చిన్న టీవీ కోసం చూస్తుంటే ఈ మోడల్ నిస్సందేహంగా బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలో .. ఎక్కువ వాల్యూ ఇస్తున్న ఈ మోడ్ కస్టమర్లకు చాలా బాగా ఉపయోగ పడుతుంది.

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×