E-Paper
Advertisement

రెండు బీసీ కార్డులు… ఓ మహిళా కోటా..! ఇదేనా కొండంత ధీమా..?

రెండు బీసీ కార్డులు… ఓ మహిళా కోటా..! ఇదేనా కొండంత ధీమా..?
Advertisement

అధిష్టానం సీరియ‌స్ అంటున్నారు. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం ఖాయ‌మంటున్నారు. రేవంత్ మ‌రీ మ‌రీ సీరియ‌స్‌గా ఉన్నాడ‌ని ప్ర‌చారం జోరందుకుంటున్న‌ది. కానీ ఈ చెప్పే విధానాల‌కు, బ‌య‌ట ప్ర‌చారాల‌కు, బ‌య‌ట ప్రాక్టికాలిటీకి చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తున్న‌ది.

కొండా సురేఖ‌.. త‌న కూతురు సుష్మిత వ్యాఖ్య‌ల‌కు త‌న‌ను బాధ్యురాల‌ని చేయొద్ద‌ని తిరిగి కౌంట‌ర్ లేఖ రాశారా…  ఆ త‌ర‌వాత మ‌రుస‌టి రోజే వారి ఇంట్లో బాల్కానీ నుంచి త‌ల్లీ కూతుర్లిద్ద‌రు .. చిరున‌వ్వులు చిందిస్తూ మీడియాతో మాట్లాడే సీన్లు ఆమెలో తాజా ప‌రిణామాలు ఏమాత్రం జంకును తెచ్చిపెట్టిన‌ట్టు క‌నిపించ‌లేదు.

Advertisement

ఇదంతా ప‌క్కా వ్యూహంతోనే, ముంద‌స్తుగా అనుకునే అంతా క‌లిసి ఆడిన ఫ్యామిలీ డ్రామా అని తేలిపోయింది. ఇందులో అనుమానం లేదు. ఇక రేవంత్ రాగానే చ‌ర్య‌లుంటాయి.. అనేది బాగా ప్ర‌చారం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అలా ఒత్తిడి పెంచ‌డం మూలంగానైనా కొండా సురేఖ‌పై వేటు ప‌డితే అది కాంగ్రెస్‌కు మేలు జ‌రుగుతుంద‌ని, మ‌రోసారి అస‌మ్మ‌తి గ‌ళం వినిపించాలంటేనే గ‌జ్జుమ‌నే ప‌రిస్థితులు క్రియేట్ అవుతాయ‌ని భావిస్తున్నారు.

కానీ అక్క‌డ అంత సీన్ క‌నిపించ‌డం లేదు. గ‌తంలోనూ సుష్మిత ఇదే త‌ర‌హాలో.. ఇంత‌కు త‌గ్గ‌కుండా రేవంత్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయినా బారాఖూన్ మాఫ్ చేసేశారు సీఎం. మ‌రి ఇప్పుడు కూడా అదే తోవ‌లో ముందుకు పోతాడు త‌ప్ప‌.. మ‌రోటి ఉండ‌ద‌నేది క్లారిటీగా తెలుస్తూనే ఉంది. అయితే గియితే గ‌ట్టిగా ఓ సారీ చెప్పించుకుని త‌మ‌ను తాము చ‌ల్ల‌బ‌రుచుకుని, మాన‌సికంగా తృప్తి చెందుతారు కావొచ్చు.

Advertisement

ఎందుకంటే కొండా సురేఖ‌కు మూడంచెల సామాజిక భ‌ధ్ర‌త ర‌క్ష‌ణ క‌వ‌చంలా కాపాడుతూ వ‌స్తోంది. ఆమె ఎన్ని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా.. అంద‌రితో కంఠుగా మారి.. ఒంట‌రిగా మిగిలిన త‌న దోర‌ణి విడ‌వ‌డం లేదు. కూతురుకు ప‌ర‌కాల టికెట్ ఇప్పించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా.. ఇప్పుడు సుష్మిత చేతిలో కొండా ముర‌ళి, సురేఖ‌లు కీలు బొమ్మ‌ల‌నే చెప్పాలి.

రెండు బీసీ కార్డులు.. మున్నూరుకాపు, ప‌ద్మ‌శాలి ఇవి చాలా పెద్ద అసెట్స్ కొండా సురేఖ‌కు. ఆ త‌రువాత మ‌హిళా కోటా ఇది డిఫెన్స్‌లో ప‌డ‌కుండా త‌న‌కు ర‌క్ష‌ణ క‌వచంలా ఆప‌ద‌లో కాపాడే మంత్ర‌మే. అందుకే ఇప్పుడు ఈ మూడు ర‌క్ష‌ణ క‌వ‌చాల‌ను తొడుక్కొని ఉన్న సురేఖ‌పై వేటు, చ‌ర్య‌లు, స‌స్పెండు.. ఇవ‌న్నీ ఉత్త ప్ర‌చారానికే. కాంగ్రెస్ లీడ‌ర్ల‌కు ఏదో కొద్ది రోజులు తృప్తి ప‌డేందుకు వార్త‌లు స‌జీవంగా ఉంచుతారేమో గానీ, అంతిమంగా దీనికి శుభంకార్డే ప‌డుతుంది. ఇదే జ‌ర‌గ‌బోయేది.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×