Threads : మెటా (meta) ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ స్మార్ట్ ఫోన్ యాప్… థ్రెడ్ (Threads) 100 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టివ్ యూజర్‌లను కలిగి ఉందని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
స్మార్ట్ ఫోన్ యాప్… థ్రెడ్ (Threads) వాడకం, యూజర్స్ గురించి మెటా ఎప్పటికప్పుడు క్లియర్ గా వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్‌లో ప్రస్తుతం 100 మిలియన్లకు పైగా రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని వెల్లడించారు. జుకర్‌బర్గ్ తన తాజా థ్రెడ్ పోస్ట్‌లో ఉన్న యూజర్స్ కోసం తెలిపింది. “థ్రెడ్ కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు 300M+ నెలవారీ యాక్టివ్‌లు యూజర్స్, 100M+ రోజువారీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారని తెలిపింది.
అయితే ” Meta రోజువారీ యాక్టివ్ యూజర్ డేటాను పబ్లిక్‌గా విడుదల చేయడం ఇదే మొదటిసారి. కంపెనీ 300 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులున్నారని తెలిపింది. ఇది నవంబర్‌లో ఈ సంఖ్య 275 మిలియన్లు ఉండగా.. ప్రస్తుతం నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య 300 మిలియన్లకు చేరింది.
ఇక ఎలాన్ మస్క్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసిన తర్వాత X నుండి నిష్క్రమిస్తున్న మిలియన్ల యూజర్స్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది మెటా. దీంతో జులై 2023లో ఈ యాప్ ను ప్రారంభించింది. కాగా అప్పటినుంచి ఇప్పటి వరకు యూజర్స్ పెరుగుతూనే వచ్చారు. ఇప్పుడు థ్రెడ్ 100 మిలియన్లకు పైగా రోజువారీ క్రియాశీల వినియోగదారులతో అతిపెద్ద టెక్స్ట్-ఫస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా మారింది. ఇక పెరుగుతుండటంతో కంపెనీ ఇంతకు ముందు నెలవారీ యాక్టివ్ యూజర్‌లను విడుదల చేసింది. అయితే రోజువారీ యాక్టివ్ యూజర్‌లను విడుదల చేయడం ఇదే మొదటిసారి.
మెటాకు కంపెనీ తన ప్రత్యర్థి సోషల్ నెట్‌వర్క్ బ్లూస్కైతో గట్టి పోటీలో ఉంది. ఇది 25 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉందని మెటానే తెలిపింది. అయితే థ్రెడ్ ఇంకా చాలా ఎక్కువ యూజర్స్ ను కలిగి ఉందని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. నవంబర్‌లో కంపెనీ రిజిస్టర్ చేసిన మిలియన్ల సైన్ అప్‌లను ఆడమ్ ఫ్రూఫ్ గా చూపించారు. ఇక మొస్సేరి ప్రకారం, ఈ కంపెనీ నవంబర్‌లోనే 15 మిలియన్లకు పైగా సైన్అప్‌లను చూసిందని తెలుస్తుంది.
థ్రెడ్ పెరుగుదల, ప్రతి నెలా పొందుతున్న మిలియన్ల మంది వినియోగదారుల గురించి మెటా ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక BlueSky యాప్ కలిగి ఉన్న థ్రెడ్ యాప్ లో లేని అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి DM. ప్రస్తుతం థ్రెడ్‌ల కంటే బ్లూస్కీకి ఉన్న ముఖ్య ప్రయోజనాల్లో ఇది ఒకటి. అయినప్పటికీ, థ్రెడ్‌లపై DM ఫీచర్‌ని జోడించే అవకాశాన్ని Meta అన్వేషిస్తోంది. ఇక చూడాలి.. మెటా త్వరలో మరిన్ని ఫీచర్స్ ను థ్రెడ్ లో సైతం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మెటా ఆధ్వర్యంలో నడుస్తున్న యాప్స్ లో ఎన్నో ఫీచర్స్ వస్తున్నాయి. ఇక ఇందులో ఇంకెన్ని మార్పులు జరగనున్నాయో చూడాలి.
ALSO READ : మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి? రూ.2 లక్షల జరిమానా లేదా జైలు శిక్ష తప్పదు, బీ అలర్ట్!