BigTV English

Keerthy Suresh: తన బాలీవుడ్ డెబ్యూ కోసం కీర్తి సురేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

Keerthy Suresh: తన బాలీవుడ్ డెబ్యూ కోసం కీర్తి సురేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

Keerthy Suresh: చాలావరకు సీనియర్ సౌత్ హీరోయిన్స్.. బాలీవుడ్‌లోకి వెళ్లాలని పెద్దగా కలలు కనరు. అలాగే ఎంతోమంది సౌత్ బ్యూటీస్.. ఇక్కడ భాషల్లోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ ఈరోజుల్లో యంగ్ బ్యూటీస్‌తో పోటీపడడం కోసం సీనియర్ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల నయనతార కూడా అలాగే షారుఖ్ ఖాన్ సినిమాతో బీ టౌన్‌లో డెబ్యూ చేసింది. తన రూట్‌నే ఫాలో అవుతూ తాజాగా నయనతార కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తాజాగా ‘బేబి జాన్’ అనే మూవీలో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల అవుతుండగా దీనికోసం తన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.


ప్రమోషన్స్‌లో యాక్టివ్

వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబి జాన్’ సినిమాతో కీర్తి సురేశ్ మొదటిసారి బాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. ఇప్పటివరకు కీర్తి నటించిన సినిమాలు పెద్దగా హిందీలో విడుదల కాలేదు. అందుకే తనకు బీ టౌన్ ప్రేక్షకుల్లో అంతగా రీచ్ లేదు. ఇదే సమయంలో ‘బేబి జాన్’లో తనకు అవకాశం లభించింది. అందుకే ఒకవైపు తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా కూడా ‘బేబి జాన్’ ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొంది కీర్తి. ఈ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ ధావన్, మరొక హీరోయిన్‌గా నటించిన వామికా గబ్బితో తాను కూడా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొని హిందీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది.


Also Read: థియేటర్‌లోకి మళ్లీ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’.. రిలీజ్ ట్రైలర్ చూశారా..?

భారీ రెమ్యునరేషన్

సౌత్ సినిమాలకు కీర్తి సురేశ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ‘బేబి జాన్’ (Baby John) కోసం తను రూ.4 కోట్లు ఛార్జ్ చేస్తుందని సమాచారం. ఇది తనకు హిందీలో తొలి సినిమానే అయినా భారీ ప్రొడక్షన్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో రెమ్యునరేషన్ విషయంలో తను వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. తమిళంలో విజయ్‌తో కలిసి ‘తేరీ’ అనే సినిమాను తెరకెక్కించాడు అట్లీ. ఇప్పుడు ‘బేబి జాన్’.. ‘తేరీ’కి రీమేక్‌గా తెరకెక్కింది. తను తెరకెక్కించిన సినిమాకు రీమేక్ కావడంతో మరికొందరు బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ‘బేబి జాన్’ను తానే భారీ బడ్జెట్‌తో నిర్మించాడు అట్లీ. ‘జవాన్’తో ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు లభించింది.

కీర్తి పేరు వైరల్

గత కొన్నిరోజులుగా కీర్తి సురేశ్ (Keerthy Suresh) పేరు వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ముందుగా ‘బేబి జాన్’తో తన బాలీవుడ్ డెబ్యూ గురించి కొన్నిరోజులు హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత టీజర్‌లో కీర్తిది ఒకటే షాట్ ఉండడం గురించి ప్రేక్షకులంతా మాట్లాడుకున్నారు. ఇటీవల ‘బేబి జాన్’ నుండి నైన్ మటాకా అనే పాటలో కీర్తి చేసిన గ్లామర్ షో చూసి ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. అలా కీర్తి సురేశ్ గురించి తరచుగా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా తను ప్రేమించిన ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకొని మరోసారి వైరల్ అయ్యింది. హిందువు, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకొని ఆ ఫోటోలను సంతోషంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌తో పంచుకుంది కీర్తి సురేశ్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×