Sim Cards :టెలీ కమ్యూనికేషన్ లా (Telecommunucation Law) కోసం తెలుసా.. దీని ప్రకారం ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉండాలో తెలుసా.. నిజానికి ఈ లా ప్రకారం ఒక వ్యక్తికి పరిమిత సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇలా కాకుండా ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు.
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయా.. అయితే మీరు త్వరలోనే ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. జైలు శిక్ష లేదా జరిమానా కట్టాల్సిన సమయం కూడా రావచ్చు. మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరైనా సిమ్ కార్డ్స్ తీసుకున్నా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుపుతూ టెలికమ్యూనికేషన్ మరొకసారి తన రూల్స్ ను గుర్తు చేసింది. సిమ్ కార్డ్స్ కు లిమిట్ ఉంటుందని చెబుతూ పరిమిత స్థాయిలో మాత్రమే ఒక వ్యక్తి దగ్గర సిమ్ కార్డ్స్ ఉండాలని చెప్పింది. ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డ్స్ మాత్రమే ఉండాలని.. ఈ రూల్ ను ఎవరైనా మీరితే రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా సైతం ఉంటుందని తెలిపింది.
జమ్ము కాశ్మీర్, అస్సాం, నార్త్ ఈస్ట్ లాంటి లైసెన్సెడ్ సర్వీస్ ఏరియాస్ లో కొందరు అపరిమితంగా సిమ్ కార్డ్స్ కొంటున్నారని.. ఇలాంటి ప్రదేశాల్లో కచ్చితంగా టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 ను అమలు చేస్తామని హెచ్చరించింది.
మొదటిసారి ఎవరైనా పరిమితికి మించి సిమ్ కార్డ్స్ ను కలిగి ఉంటే వారికి రూ. 50 వేల వరకు జరిమానా ఉంటుందని.. ఇక చెప్పినా వినకుండా ఈ రూల్ ను మితిమీరితే శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా ఉంటుందని తెలిపింది.
Sanchar Saathi portal –
అయితే మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయేమో అనే భయం ఉంటే ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే.. సంచార్ సాతీ పోర్టల్ లో తెలుసుకోవచ్చు. ఇందులో మీ పేరు, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో కనిపిస్తుంది. ఇక మీకు సంబంధంలేకుండా లేదా తెలియకుండా ఉన్న సిమ్ కార్డ్స్ ను ఇందులో బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఇక గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్ ప్రకారం కొత్త సిమ్ కొనాలంటే సేఫ్టీ సెక్యూరిటీ పాటించాల్సిందే. నకిలీ సిమ్ కార్డ్స్, సైబర్ క్రైమ్స్ అరికట్టే కొత్త సిమ్ కార్డ్స్ రూల్స్ ను కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎటువంటి తప్పుడు చర్యలకు పాల్పడినా లేదా టెలికాం రూల్స్ పాటించకపోయినా రూ. 10 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.
ALSO READ : యూట్యూబర్స్ కోట్లు ఎలా సంపాదిస్తున్నారో తెలుసా? ఇది తెలిస్తే మీరూ కింగే!