Big Stories

TidyBots:- ఇంటి పనుల్లో సాయం చేసే టిడీబోట్..

idyBots:- ఏ కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చినా.. అది మనుషులకు మంచిది కాదని.. వారికి హాని కలిగిస్తుందని వాదించడానికి కొందరు నిపుణులు ముందుకొస్తారు. అలాగే రోబోలు తయారు చేసినప్పుడు కూడా మనిషిలాగా ఆలోచించలేని ఈ యంత్రం ఏదో ఒక విధంగా వారికి హాని చేస్తుందని చాలామంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రోబోలే.. చాలా రంగాలలో మనుషులకు సాయంగా ఉంటున్నాయి. అదే తోవకు చెందినది కొత్త రకమైన ‘టిడీబోట్’.

- Advertisement -

ఇప్పటికే రోబోలు ఫ్యాషన్ దగ్గర నుండి ఫుడ్ వరకు చాలావరకు రంగాల్లో మనుషులకు సాయం చేస్తున్నాయి. మనుషుల్లాగా ఉండే రోబోలు ఇంటిపనుల్లో కూడా సాయంగా ఉంటున్నాయి. అలాంటి పనుల కోసమే టిడీబోట్ అనేవి తయారయ్యాయి. ముఖ్యంగా ఇంట్లోని పనులు చేయడం, లాండ్రీ చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి వాటికోసం టిడీబోట్‌లు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే ఇంటిపనుల్లో సాయం చేయడానికి పలు రకాల రోబోలు ఉన్నా టిడీబోట్.. వాటికంటే కొంచెం భిన్నమైనదని చెప్తున్నారు.

- Advertisement -

ఫ్లోర్ మీద పడిన చెత్తను శుభ్రం చేయడం, ఎక్కడ ఉండాల్సిన వస్తువులను తిరిగి అక్కడే పెట్టేయడం.. ఇలాంటివాటిలో టిడీబోట్ స్పెషలిస్ట్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓనర్ చెప్పే కమాండ్స్‌ను విని టిడీబోట్.. ఇంటి పనులు అన్నింటిని చకచకా చేసేస్తుందని తెలిపారు. టిడీబోట్‌ను తయారు చేసే ముందు శాస్త్రవేత్తలు.. వారు తయారు చేసిన డేటాసెట్‌ను జీపీటీ 3పై ప్రయోగించి చూశారు. ఇదంతా జీపీటీ 3 కరెక్ట్‌గా పాటించిందని వారు బయటపెట్టారు. అదే ఐడియాతో వారు టిడీబోట్‌కు ప్రాణంపోశారు.

టిడీబోట్‌ను అందరికీ పరిచయం చేసేముందు వేర్వేరు గదుల్లో దీనికి 24 వేర్వేరు టాస్కులు ఇచ్చారు. ఇందులో చాలావరకు టాస్కుల్లో టిడీబోట్ పనితీరు ప్రశంసనీయంగా ఉందని అన్నారు. ఓనర్లు వస్తువుల పేర్లు చెప్తూ వాటిని ఏం చేయాలో కమాండ్ చేస్తూ ఉంటే.. టిడీబోట్స్ ఆ కమాండ్స్ ఆధారంగా పనిని పూర్తి చేస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ముందు ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టిన తర్వాత టిడీబోట్స్ ఇల్లు శుభ్రం చేయడాన్ని ప్రారంభిస్తాయని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News