Titan Celestor smartwatch:ఇండియన్ మార్కెట్లో క్వాలిటీకి మారుపేరైన టైటాన్ బ్రాండ్, లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్ వాచ్ రంగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా.. రన్నింగ్, హైకింగ్, ట్రేకింగ్ , అవుట్‌డోర్ ఫిట్‌నెస్పై శ్రద్ధ పెట్టే ..వారి కోసం టైటాన్ ప్రత్యేకంగా రూపొందించిన మోడలే ‘టైటాన్ సెలెస్టర్’. రూ. 9,995 ధర పరిధిలో.. లభించే ఈ స్మార్ట్ వాచ్‌లో అమర్చిన ఫీచర్లు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈ స్మార్ట్‌వాచ్ అందించే ప్రధాన ఫీచర్లు, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. అత్యంత కచ్చితమైన ఇన్‌బిల్ట్ జీపీఎస్ :
అవుట్‌డోర్ యాక్టివిటీస్ చేసేవారికి.. లొకేషన్ ట్రాకింగ్ చాలా ముఖ్యం. ఈ టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్‌లో అత్యంత కచ్చితమైన రీడింగ్ ఇచ్చే ఇన్‌బిల్ట్ జీపీఎస్ టెక్నాలజీని వాడారు. ఫోన్ దగ్గర లేకపోయినా మీ రన్నింగ్ రూట్, సైక్లింగ్ పాత్ , డిస్టెన్స్‌ను ఇది చాలా కచ్చితంగా ట్రాక్ చేస్తుంది.
2. అవుట్‌డోర్ సెన్సార్లు:
సాధారణ స్మార్ట్‌వాచ్‌లలో లభించని ప్రత్యేకమైన అవుట్‌డోర్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.
అల్టిమీటర్ : మీరు ఎంత ఎత్తులో ఉన్నారో ఇది కచ్చితంగా కొలుస్తుంది. ట్రేకింగ్ చేసే.. వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.
బారోమీటర్ : వాతావరణంలో.. వచ్చే పీడన మార్పులను, వాతావరణ స్థితిగతులను అంచనా వేయడానికి సహాయ పడుతుంది.
కంపాస్: దిశలను సూచించడంలో.. పర్ఫెక్ట్‌గా పని చేస్తుంది. అడ్వెంచర్ లవర్స్ కోసం ఇవి నిజంగా చాలా గొప్ప ఫీచర్లు.
3.స్ట్రావా, ఫిట్‌నెస్ ఇంటిగ్రేషన్:
ఫిట్‌నెస్ డేటాను ట్రాక్ చేయడానికి, గ్లోబల్ ఫిట్‌నెస్ కమ్యూనిటీతో.. పంచుకోవడానికి ప్రముఖ యాప్ అయిన ‘స్ట్రావా’సపోర్ట్ దీనిలో లభిస్తుంది. మీ వర్కౌట్ డేటా.. మొత్తాన్ని సింక్ చేసుకోవడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
4. డిస్‌ప్లే, డిజైన్ :
ఈ వాచ్ ప్రీమియం లుక్‌తో యూజర్లను ఆకట్టుకుంటుంది. బ్లాక్ కలర్ డయల్, గ్రే కలర్ స్ట్రాప్ కాంబినేషన్ దీనికి స్పోర్టివ్ , క్లాసీ లుక్‌ను ఇస్తుంది. బ్రైట్ అయిన అమెలోడ్ డిస్‌ప్లే ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే .. రోజూవారీ వాడకానికి సరి పోయేలా బలమైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంది.
5. బ్యాటరీ లైఫ్:
ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు, సెన్సార్లు , జీపీఎస్ రన్ అవుతున్నప్పటికీ, దీని బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో మెరుగైన రోజులు బ్యాటరీ వస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. అధికారికంగా రూ. 9,995 ధరతో మార్కెట్లో లభిస్తోంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.
మీదో హెల్త్ కాన్షియస్ లైఫ్‌స్టైల్ అయినా.. లేదా అడ్వెంచర్స్, ట్రేకింగ్ అంటే ఇష్టమైనా.. టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుది. తక్కువ బడ్జెట్‌లో ప్రొఫెషనల్ అవుట్‌డోర్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!