E-Paper
Advertisement

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!
Advertisement

Indiramma Houses: దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో పొన్నం కోమల సమ్మయ్య ముదిరాజ్ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంట్లో నిర్వహించిన ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబానికి నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో పూర్తయిన 2,728 ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజాపాలనలో నియోజకవర్గానికి మొత్తం 5,500 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి కుటుంబానికి విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

నిర్మాణాలపై అధికారులకు ఆదేశాలు

Advertisement

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 545 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 94 మాత్రమే పూర్తికావడంపై మున్సిపల్ కమిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేయాలని, పనులు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రెండో విడతలో హుస్నాబాద్ పట్టణానికి 96, గ్రామీణ హుస్నాబాద్‌కు 86, అక్కన్నపేటకు 167, కోహెడకు 192, చిగురుమామిడికి 173, సైదాపూర్‌కు 159, భీమదేవరపల్లికి 188, ఎల్కతుర్తికి 158 ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి వినతులపై నిర్లక్ష్యం వద్దు

ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా రికార్డు చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. భూ సమస్యలు, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భర్తను కోల్పోయిన మహిళలకు 15 రోజుల్లో వితంతు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జరిగే ప్రజావాణిలో నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో స్వయంగా పాల్గొంటానని తెలిపారు.

Advertisement

ఉచిత ఉపకరణాల పంపిణీ..

రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని 173 గ్రామాల అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు అలింకో ద్వారా ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులందరికీ సమాచారం అందించి ప్రయోజనం చేకూర్చాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి .వెంకటరమణ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నరాజు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read: రైతులకు బంపర్ ఆఫర్! క్వింటాల్ వరి రూ.5,500? ఎలాగో తెలుసా?!

Tags

Related News

మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవ్వదు.. కేటీఆర్ గడ్డం పై సీఎం రేవంత్ కౌంటర్!

తెలంగాణ ఖైదీలకు.. కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న జైళ్ల శాఖ!

రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా

రైతులకు బంపర్ ఆఫర్! క్వింటాల్ వరి రూ.5,500? ఎలాగో తెలుసా?!

కొడంగల్ అభివృద్ధి నిధులపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

విద్యుత్ సేవల్లో ఆలస్యమైందా.. అయితే వెంటనే పరిహారం పొందే అవకాశం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×