Makerspace Lab : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఫ్యూచర్ మేకర్‌స్పేస్ ల్యాబ్‌ను బెంగళూరులో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రారంభించిన మేకర్‌స్పేస్ ల్యాబ్ AI, రోబోటిక్స్‌తో విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రాం కోసం ఇండియా తరపున లీడ్ తీసుకున్న అక్షయ్ కశ్యప్ తెలిపారు. సృష్టికర్తలుగా, ఆలోచనాపరులుగా, బిల్డర్లుగా యువత తమ సామర్థ్యాన్ని గ్రహించేలా వారిని శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
అమెజాన్ ఫ్యూచర్ మేకర్‌స్పేస్ ను బెంగుళూరులో ప్రారంభించిన నేపథ్యంలో.. మేకర్‌స్పేస్ ల్యాబ్ అనేది ఒక ఇన్నోవేషన్ హబ్ అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యార్ధులు తమకు నచ్చిన విధంగా ప్రయోగాలు చేసే అవకాశం ఈ ల్యాబ్ లో ఉందని తెలిపారు. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించేలా విద్యార్ధులు ప్రాజెక్ట్‌లను తయారు చేయ్యెుచ్చని.. రోబోటిక్స్, AI, 3D ప్రింటింగ్ తో పాటు డ్రోన్ టెక్నాలజీ వంటి విషయాలపై విద్యార్ధులకు బోధిస్తుందని తెలిపారు. Makerspace ల్యాబ్‌తో అమెజాన్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు పిల్లలకు కంప్యూటర్ సైన్స్ లో శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రభుత్వ, గ్రామీణ పాఠశాలల్లో సాధారణంగా నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ విద్య అందుబాటులో ఉండదని అందుకే ఈ ప్రోగ్రామ్ ను మెుదలుపెట్టామని తెలిపారు.
ఉన్నత సాయి కంప్యూటర్ విద్యను విద్యార్థులకు అందించడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, ఉపకార వేతనాలు ఇస్తామని, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలకు ఇంటర్న్ షిప్ అందించడం వంటివి కూడా చేస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రాం ద్వారా బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్‌డ్ లెవెల్ లో బోధన ఉంటుందని తెలిపారు. కొత్త విషయాలను తేలికగా అన్వేషించే అవకాశం ఉంటుందని.. ఇందుకోసం వర్క్ ఫోర్స్ ల్యాండ్ స్కేప్ ను నావిగేట్ చేయడానికి కీలకమైన నైపుణ్యాలను అందిస్తామని తెలిపారు.
కరోనా సమయంలో నేర్చుకున్న ఒక కీలకమైన పాఠం ఇక్కడ పనిచేస్తుందని.. ఉపాధ్యాయులకు ఎంత ఉన్నతంగా విద్యార్హతలు ఉంటే విద్యార్థులు సైతం ఆదే స్థాయిలో నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు సైతం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పుకువచ్చారు. నిజానికి ఈ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంత తేలికైన విషయం కాదని… కానీ ప్రతీ సమస్యను ఎదుర్కొని విద్యార్థులు ఉన్నత స్థాయి స్కిల్స్ ను అందుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఎటువంటి లాభపేక్షాలేని కార్యక్రమం ఇది అని విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీర్ఘకాలికంగా కంప్యూటర్ సైన్స్ ను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా అమెజాన్ పనిచేస్తుందని తెలిపారు.
ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని తర్వాత తరాలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3d ప్రింటింగ్ తో పాటు ఇన్నోవేషన్స్ చేయటానికి ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చిన్న వయసులో నేర్చుకున్న స్కిల్సే తర్వాత భవిష్యత్తుకు ఉపయోగపడతాయని వారికి భవిష్యత్తును చూపిస్తాయని చెప్పుకొచ్చారు.
ALSO READ : పేరెంట్స్ బీకేర్ ఫుల్.. డిప్రెషన్‌లో 33.1% టీనేజర్లు..!