E-Paper
Advertisement

రోజంతా ఏసీలో ఉన్నంత చల్లగా ఉండాలా? అయితే ఈ రాగి పాలు తాగాల్సిందే!

రోజంతా ఏసీలో ఉన్నంత చల్లగా ఉండాలా? అయితే ఈ రాగి పాలు తాగాల్సిందే!
Advertisement

Ragi Milk Recipe: రోజురోజుకీ ఎండలు ముదిరిపోతున్న ఈ సమయంలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి మనం రకరకాల కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. కానీ మన బామ్మల కాలం నాటి రాగి పాలు ఇచ్చే ఆరోగ్యం, రుచి మరే పానీయంలోనూ దొరకవు. రాగులు మన శరీరాన్ని చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. ఈ డ్రింక్ కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి మంచి శక్తినిస్తాయి. ఇప్పుడు పాలు, రాగి పిండితో చాలా సులభంగా ఇంట్లోనే పానీయం ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – ఒక కప్పు
పాలు – ఒక కప్పు
బెల్లం తరుము – అర కప్పు
ఎండు ద్రాక్ష – 10 పలుకులు
ఖర్జూరాలు – నాలుగు
యాలకుల పొడి – అర టీస్పూన్
కొబ్బరి పాలు – అర కప్పు
సబ్జా గింజలు – ఒక టీస్పూన్

Advertisement

Also Read: పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా? షుగర్ లేకుండా ఇలా హెల్తీ బాదం స్వీట్ చేసి పెట్టండి!

తయారీ విధానం ఇలా..

మీరు నేరుగా రాగులను వాడాలనుకుంటే మీకు కావాల్సినంత రాగులను రాత్రంతా నానబెట్టుకుని, మరుసటి రోజు మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమం నుండి పాలను వడకట్టాలి. ఒకవేళ రాగి పిండి వాడుతుంటే, దానిని తగినన్ని నీళ్లలో కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ రాగి మిశ్రమాన్ని పోసి, సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక అందులో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా కాచి చల్లార్చిన పాలు అలాగే కొబ్బరి పాలను కలిపి దించేయాలి. దీనిని చల్లగా సర్వ్ చేసేటప్పుడు పైన నానబెట్టిన సబ్జా గింజలు వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

రాగి మిల్క్‌ ప్రయోజనాలు:

Advertisement

రాగి పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎందుకంటే.. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం లేకుండా తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో నీరసం రాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇదొక అద్భుతమైన హెల్త్ డ్రింక్.

Also Read: చుక్క నూనె కూడా వద్దు.. ఆ ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×