Big Stories

ChatGPT:- చాట్‌జీపీటీపైనే పేషెంట్ల నమ్మకం.. స్టడీలో వెల్లడి..

ChatGPT:- కృత్రిమ మేధస్సు అనేది మనుషులకు మంచిది కాదు. ఎప్పటికైనా అది మానవాళికి హాని కలిగిస్తుంది అని విమర్శించిన వారికి ఇప్పటికే ఎన్నోసార్లు ఏఐ సామర్థ్యంతో తయారు చేయబడిన చాట్‌జీపీటీ గట్టి సమాధానమే ఇచ్చింది. అంతే కాకుండా తయారు చేసి కొన్ని నెలలే అయినా కూడా చాట్‌జీపీటీ ఇప్పటికే మెడికల్ రంగంలో ఎంతో వృద్ధిని సాధించింది. తాజాగా మెడికల్ రంగంలో చాట్‌జీపీటీ మరో ఘనతను సాధించింది.

- Advertisement -

ఫిజీషియన్స్ కంటే చాట్‌జీపీటీనే పేషెంట్లను బాగా ట్రీట్ చేస్తుందని శాస్త్రవేత్తలు చేసిన స్టడీ తేలింది. హై క్వాలిటీ ట్రీట్మెంట్‌ను అందించే విషయంలో కానీ, పేషెంట్లను సలహాలు ఇచ్చే విషయంలో కానీ చాట్‌జీపీటీ పనితనం బాగుందని పేషెంట్లు స్వయంగా చెప్పినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మెడికల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లాంటిది ఎలా ముందుకు వెళుతుందని అనుమానించిన వారికి ఇదే సమాధానమన్నారు.

- Advertisement -

ట్రీట్మెంట్ విషయంలో హై క్వాలిటీ ప్రొఫెషనల్స్ సైతం చాట్‌జీపీటీ సమాధానాలను నమ్ముతున్నారని తేలింది. 79 శాతం చాట్‌జీపీటీ సమాధానాలు కరెక్ట్‌గా ఉన్నాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మెడికల్ రంగంలో ఏఐ ఘనత సాధిస్తుంది అనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మెడిసిన్ రంగంలో ఏఐ అనేదే భవిష్యత్తు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫిజిషియన్స్‌పై అదనపు బారాన్ని తగ్గించిన చాట్‌జీపీటీ.. పేషెంట్ల దగ్గర నుండి కూడా ప్రశంసలు పొందుతుందని తెలిపారు.

ఇటీవల ఫిజిషియన్ల సమాధానాలను, చాట్‌జీపీటీ సమాధానాలను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాలు మరింత కచ్చితంగా ఉన్నాయని వారు నిర్ధారించారు. ఇందులో 3.6 శాతం ఎక్కువ మార్కులు చాట్‌జీపీటీకే పడినట్టు తెలుస్తోంది. అయితే దీన్ని బట్టి డాక్టర్లను పూర్తిగా దూరం పెట్టి చాట్‌జీపీటీ పైనే ఆధారపడాలని తమ ఉద్దేశ్యం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మెడికల్ రంగంలో చాట్‌జీపీటీ ఘనతను సాధించినా.. డాక్టర్ల ప్రమేయం లేకుండా దానిని పూర్తిగా నమ్మలేమని గుర్తుచేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News