Big Stories

UAE Astronaut:- 7 గంటల పాటు స్పేస్ వాక్.. యూఏఈ ఘనత..

UAE Astronaut:- ఒకప్పుడు అంతరిక్షంలో కాలు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం. కానీ ఈరోజుల్లో అంతరిక్షానికి వెళ్లడం మాత్రమే కాదు.. కొన్నిరోజుల పాటు అందులోనే ఉండగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా యూఏఈకు చెందిన ఆస్ట్రానాట్ కూడా ఇలాంటి సాహసమే చేశాడు. యూఏఈకు చెందిన సుల్తాన్ అల్ నియాదీ త్వరలోనే స్పేస్‌లో రెండు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రానాట్స్ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

మార్చ్ 2న క్రూ 6 టీమ్‌తో పాటు సుల్తాన్ అంతరిక్షంలోకి చేరుకున్నారు. ఫ్లోరిడాలోని కేప్ కానవేరాల్ ద్వారా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ రెండు నెలల్లో సుల్తాన్ సాధించిన ఘనతలు స్పేస్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మొట్టమొదటి అరబ్‌ ఆస్ట్రానాట్‌గా సుల్తాన్ రికార్డ్ సాధించారు. ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) ఏర్పాటు చేసిన దూళం లాంటి ఆకారంపై 7.01 గంటల పాటు స్పేస్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

- Advertisement -

ముఖ్యంగా సుల్తాన్.. నాసా ఫ్లైట్ ఇంజనీర్ అయిన స్టీఫెన్ బోవెన్‌తో కలిసి స్పేస్‌కు వెళ్లడానికి కారణం పవర్ కేబుల్స్‌ను రూట్ చేయడమే. అది వారు ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు. ఈ కేబుల్ వర్క్ అనేది భవిష్యత్తులో యూఏఈ పరిశోధనలకు సాయంగా ఉండేలా వారు డిజైన్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రోల్ ఔట్ సోలార్ అర్రే (ఐరోసా). ఇది త్వరలోనే ప్రయాణానికి సిద్ధంగా ఉన్న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ కార్గో మిషన్‌కు కూడా ఉపయోగపడనున్నట్టు తెలుస్తోంది.

స్పేస్ వాక్‌తో పాటు సుల్తాన్ ఇతర ఘనతలను కూడా సాధించారు. రీసెర్చ్ కోసం ఎయిర్ శాంపిల్స్‌ను కూడా కలెక్ట్ చేశారు. దాదాపు 1,950 కిలోల పరిశోధనలకు సంబంధించిన వస్తువులను డ్రాగన్ కార్గో స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా తిరిగి నేలపైకి పంపించారు. దీంతో పాటు రెండు టెక్నాలజీ పరిశోధనల ప్రారంభానికి కూడా సుల్తాన్ సాయం చేశారు. ఇవన్నీ చూసిన ఇతర దేశాల ఆస్ట్రానాట్స్.. ఇప్పుడు దీనిని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని దీనికి మించిన రికార్డులు క్రియేట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News