Upcoming Phones In December 2024 : 2024 చివరికి వచ్చేశాం. డిసెంబర్ నెల వచ్చేసింది. దీంతో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ ఏడాదిని కొత్త ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేసి ముగించాలని ఆశిస్తున్నాయి. అది కూడా సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేసేలా వాటిని ఆవిష్కరిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని పెద్ద ఫోన్లు కూడా రానున్నాయి. వీటిలో రెడ్మీ నోట్ 14, వీవో X200 లైనప్ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ ఏ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి? వాటి ధర ఎంత, ఏ ఫీచర్స్‌తో వస్తున్నాయి? ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.
ఈ డిసెంబర్ లో లాంఛ్ కాబోతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ లో రెడ్ మీ, వివో, ఐక్యూ, వన్ ప్లస్ తో పాటు గ్జియోమీ సైతం ఉన్నాయి. ఈ ఫోన్స్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇకెందుకు ఆలస్యం టాప్ ఫీచర్స్ తో వచ్చేస్తున్న ఈ మెుబైల్స్ లిస్ట్ పై మీరు ఓ లుక్కేయండి.
1. Redmi Note 14 Series – Redmi Note 14 సిరీస్ డిసెంబర్ 9న భారత మార్కట్లో లాంఛ్ కానుంది. ఈ లైనప్‌లో Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro ప్లస్ వంటివి రానున్నాయి. Redmi Note 14 Pro Plus టెలిఫోటో లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో కూడిన కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, IP68 వాటర్ రెసిస్టెన్స్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, ఇమేజ్ ఎరేజర్ వంటి AI ఫీచర్లను అందించనుందట. ఈ లైనప్‌లో టాప్ మోడల్ 6,200 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిసింది.
2. Vivo X200 Series – డిసెంబర్ నెలలో Vivo ఫ్లాగ్‌షిప్ కెమెరా స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో, X200 సిరీస్ రానున్నాయి. X200, X200 ప్రో మోడళ్లను విడుదల చేయనుందట. Zeiss ఇమేజింగ్ సిస్టమ్‌తో ఇవి రానున్నాయి. డైమెన్సిటీ 9400 SoCతో పాటు V3+ చిప్‌తో X200 సిరీస్ రానుందట. X200 ప్రోలో 6,000 mAh సెమీ-సాలిడ్ స్టేట్ బ్యాటరీ, X200లో 5,800 mAh బ్యాటరీ సామర్థ్యం ఉండనుందట.
3. iQOO 13 (Dec 3) – iQOO 13 డిసెంబర్ 3న లాంఛ్ కానుంది. Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రానుంది. 50 మెగా పిక్సెల్ కెమెరా సిస్టమ్‌తో పాటు గేమర్ సెంట్రిక్‌గా ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. 6,000 mAh బ్యాటరీతో పాటు 2K 144Hz గేమింగ్‌కు బాగా సపోర్ట్ చేస్తుంది.
4. OnePlus 13 Smart Phone – OnePlus 13 కూడా ఈ నెలలో లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో అఫీషియల్ రిలీజ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 13 స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ SoCతో నడుస్తుంది. 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. 6,000 mAh బ్యాటరీతో రానుంది.
5. Xiaomi 15 – Xiaomi 15 తన మొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పవర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌లో విడుదల చేసింది. త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే Xiaomi 15 Proను మాత్రం ఎప్పుడు విడుదల చేస్తుందో క్లారిటీ లేదు. Xiaomi 15 విషయానికొస్తే లైకా ఆప్టిక్స్ కలిగిన 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. 5,400 mAh బ్యాటరీని కూడా కలిగి ఉండనుంది.
ALSO READ : గేమింగ్ లవర్స్ ఈ ఆఫర్లు మీకోసమే – తక్కువ బడ్జెట్‌తో హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్స్