Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. రెండు రోజుల పర్యటన కోసం వయనాడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంకలకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. వయనాడ్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.
వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశాక.. తొలిసారి ఎంపీ హోదాలో వయనాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ ప్రేమాభిమానాలతో తనను పార్లమెంటుకు పంపించారని ఆనందం వ్యక్తం చేశారు.
జనం కోసం పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని, శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ప్రియాంకా గాంధీ చెప్పారు. వయనాడ్ ప్రజల గొంతునై.. ప్రజల సమస్యలు పార్లమెంటుకు తీసుకెళతానని ఘాటుగా సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడుస్తున్న బీజేపీ ఎంత ప్రయంత్నించినా.. ప్రజలు మాత్రం అండగా నిలబడటం వల్లే కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేకపోయిందన్నారు. తనను ప్రోత్సహిస్తున్న అన్న రాహుల్ గాంధీకి థాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: ఒడిశాలో బిజేపీ ప్రభుత్వం భేష్.. అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు: ప్రధాని మోడీ
రాహుల్ గాంధీ..
వయనాడ్ ప్రజలకు ఎంతో చేయాలని ఉన్నా.. అధికారంలో లేకపోవడం వల్ల అంత స్థాయిలో సాధ్యం కాకపోవచ్చని లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని హామీ ఇచ్చారు. అదానీపై అమెరికా ప్రభుత్వం అభియోగాలు మోపినప్పటికి.. మోదీ మాత్రం ఆయన్ను చాలా ప్రత్యేకంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వయనాడ్ ప్రజలపై మోదీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. నా చెల్లి ప్రియాంక గాంధీ, యూడీఎఫ్ నేతలకు చెబుతున్న వయనాడ్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలని సూచించారు.